బరిలో ఉండలేం..ఎమ్మెల్యేలు హ్యాండ్సప్..!

సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చే ప్రసక్తి లేదని సీఎం జగన్…ముందే తమ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా పార్టీ గెలుపు ముఖ్యమని, కాబట్టి సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టేస్తామని జగన్ చెప్పేశారు. అయితే ఎంతమందిని సైడ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈలోపే కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయడానికే ఆసక్తి చూపడం లేదని తెలిసింది.

వైసీపీలో ఉండే వర్గ పోరు కావొచ్చు..పైగా సీటు దక్కదనే డౌట్ కావొచ్చు…కొంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేయడానికే వెనుకడుగు వేస్తున్నారట. పైగా తప్పు అంతా ఎమ్మెల్యేలదే..తాను బాగా పనిచేస్తున్నానని, ప్రభుత్వం పనితీరు బాగుందని జగన్ పదే పదే చెబుతూ..ఎమ్మెల్యేలని పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఈ పరిస్తితులని దృష్టిలో పెట్టుకుని కొందరు ఎమ్మెల్యేలు ముందుగానే పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలిసింది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ రిజర్వడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే మళ్ళీ  పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. నెల్లూరులో రెండే రిజర్వడ్ స్థానాలు ఉన్నాయి. సూళ్ళూరుపేట, గూడూరు..వీటిల్లో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు సొంత పోరు ఎక్కువ ఉంది..పనితీరు సరిగ్గా లేదు. మళ్ళీ ఈయనకే సీటు డౌట్ అని ప్రచారం జరుగుతుంది. అందుకే ఈయన ముందుగానే పోటీ నుంచి తప్పుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది.

ఇటు బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదట. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా ఓ సీనియర్ ఎమ్మెల్యే సైతం పోటీకి దూరంగా ఉండాలని చూస్తున్నారట. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీకి దూరంగా ఉండే ఎమ్మెల్యల సంఖ్య ఎక్కువగానే ఉండేలా ఉంది. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయితే…ఇక్కడ ఎమ్మెలిలకు పెద్ద షాక్ ఉంటుంది. పొత్తు తగ్గట్టుగా కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే ఛాన్స్ లేదు. అటు ఉత్తరాంధ్రలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ముందుగానే రేసు నుంచి తప్పుకునేలా ఉన్నారు.