వెస్ట్ టీడీపీలో కన్ఫ్యూజన్.. ఆ సీట్లే డౌట్?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…గత ఎన్నికల్లోనే కాస్త టీడీపీ దెబ్బతింది గాని…వెస్ట్‌లో టీడీపీ బలం మాత్రం పెద్దగా తగ్గలేదు. పైగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగానే కలిసొస్తుంది. అయితే ఇక్కడ అంతా బాగానే ఉన్నా..టీడీపీలో కొంత కన్ఫ్యూజన్ ఉంది..ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ లేదు. జిల్లాలో కొన్ని సీట్లలో అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయి ఉన్నారు.

కానీ కొన్ని చోట్ల అభ్యర్ధులు ఎవరు, ఏ సీట్లు జనసేనకు ఇస్తారనే క్లారిటీ లేదు. పాలకొల్లు, ఉండి, తణుకు, ఉంగుటూరు, దెందులూరు, ఆచంట సీట్లలో ఇబ్బంది లేదు. పోలవరం, చింతలపూడి, నిడదవోలు, కొవ్వూరు సీట్లలో ఎవరు పోటీకి దిగుతారో క్లారిటీ లేదు. ఇక తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, ఏలూరు స్థానాల్లో ఇంచార్జ్‌లు ఉన్నారు..కానీ ఈ సీట్లు పొత్తు ఉంటే జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. చివరిగా గోపాలాపురం సీటులో ఇటీవల మద్దిరాజు వెంకటరాజుని ఇంచార్జ్‌గా పెట్టారు. కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అలకపాన్పు ఎక్కారు.

సీటు కూడా దాదాపు మద్దిరాజుకే దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. దీంతో ముప్పిడి వర్గం ఎంతవరకు సహకరిస్తుందనేది క్లారిటీ లేదు. ఆ వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే గోపాలాపురంలో టీడీపీకి దెబ్బపడుతుంది. ఇటు కంచుకోట అయిన కొవ్వూరులో గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సీటు కోసం జవహర్ పట్టుబడుతున్నారు. జవహర్‌కు దక్కకుండ చూసుకోవాలని వ్యతిరేక వర్గం చూస్తుంది.

చింతలపూడి సీటు క్లారిటీ లేదు.. మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు, మద్దాల రాజేష్‌ లాంటి వారు గట్టిగా ట్రై చేస్తున్నారు. ఒకరికి సీటు దక్కితే మరొకరు సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. త్వరగా జిల్లాలో సీట్లు క్లారిటీ ఇస్తే గాని పరిస్తితి చక్కబడుతుంది..లేదంటే వెస్ట్‌లో టీడీపీకి దెబ్బపడుతుంది.