ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ కోసం.. ఫ్యాన్స్ ఇంత పని చేశారా..!

NTR 30 To Get More Delay

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. త‌న తర్వాత సినిమాను కొరటాల శివ డైరెక్షన్ తన 30వ‌ సినిమాలో నటించబోతున్నాడు.. ఈ సినిమాకు సంబంధించిన మోష‌న్న్‌ పోస్టర్ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ పోస్టర్ విడుదల అయ్యాక ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇప్పటివరకు బయటకు రాలేదు. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై 8 నెలలు గడుస్తున్నా ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు పెట్టలేదు.

దర్శకుడు కొరటాల శివ ఇప్పటికి కూడా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగానే ఉన్నాడు. దీంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు.. కానీ మేకర్స్ అభిమానుల ఆశని నీరుగార్చారు. దీపావళి రోజున వస్తుంద‌ని ఆశపడ్డ అభిమానులకు నిరాసే మిగిలింది.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా #we demand NTR 30 update అనే హ్యాష్ ట్యాగ్ ను twitter లో వైరల్ చేస్తున్నారు.

తారక్‌ అభిమానులు మాకు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కావాలని చాలా ప్రశాంతంగానే సోషల్ మీడియాలో రచ్చ చేయటం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ ఇస్తే కూల్ అవుతామ‌ని ఫాన్స్ చెబుతుండగా.. సినిమా మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనేది కూడా ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది.