ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఆర్జీవీలో త‌గ్గ‌ని వేడి.. అమ్మాయిల‌తో ఫుల్ చిల్‌!

రామ్ గోపాల్ వర్మ… ఈ సంచలన డైరెక్టర్ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈయన తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. కాగా రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా కాస్త బోల్డ్ గా మాట్లాడడంతో పాటు కాంట్రవర్సీ లను క్రియేట్ చేస్తూ ఉండడంతో ఆ వ్యాఖ్యలు తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి.

అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ పక్కన వారు ఏమనుకుంటారు అనే విషయం పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు మాట్లాడుతూ.. తనకు తోచిన పనులు చేస్తూ ఉంటాడు. అయితే గతంలో రాంగోపాల్ వర్మ పబ్ లో అమ్మాయిలతో కలిసి క్లోజ్ గా మూవ్ అయి స్టెప్పులు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈయనకి సంబంధించిన అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కరలు కొడుతుంది. ఇటీవల వర్మ ఓ పార్టీలో భాగంగా అమ్మాయిలతో కలిసి డాన్సులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రామ్ గోపాల్ వర్మ అమ్మాయిలతో కలిసి చిందులు వేస్తూ తెగ సందడి చేశాడు.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆరు పదుల వయసులోనూ ఆర్జీవిలో తగ్గని వేడి అంటూ కామెంట్లో చేస్తున్నారు. కొందరు నెగిటివ్ గా కామెంట్ చేస్తుండగా.. ఏదేమైనాప్పటికీ వర్మ అమ్మాయిలతో ఫుల్ చిల్ అవుతున్నాడంటూ మరికొంతమంది వర్మకి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.