పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సింగర్ చిత్ర జీవితంలో ఇంత విషాదం ఉందా?

సింగర్ చిత్ర.. ఈమె గురించి తెలియని వారెవ్వ‌రూ ఉండరు. సౌత్ ఇండియా మొత్తం `దక్షిణ భారత నైటింగేల్` అని పిలుచుకునే సింగర్ చిత్ర.. అత్యంత తక్కువ కాలంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాల్లో పాటలు పాడి కోట్లాదిమంది మదిలో స్థానం దక్కించుకుంది. ఈమె 1963లో కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. అయితే ఈమె పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర.

ఈమె చిన్న వయసు నుంచి కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం పొంది మలయాళ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడి తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆమె మధురమైన గానానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంతా బావుంది అన్న టైంలో ఆమె జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన ఆమె తండ్రి మరణం. చిత్రమ్మ ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా తన తండ్రిని దేవుడిలా పూజించేది. ఇక తన తండ్రి మరణ వార్తతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సంఘటన నుండి బయటకు రావడానికి పాటలను ఆయుధంగా మలుచుకుని సంగీతం ప్రపంచం లో మునిగిపోయింది. అలా భాషతో సంబంధం లేకుండా ఏకంగా 25వేల పాటలను పాడింది. అంతేకాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు కూడా దక్కించుకుంది.

ఆ తరువాత 1988లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరియు ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయినా విజయ శంకర్ ని పెళ్లి చేసుకుంది. ఏకంగా 14 సంవత్సరాలు పాటు పిల్లలు లేని బాధను అనుభవించిన చిత్రమ్మకు ఎట్టకేలకు నందన అనే అమ్మాయిని పుట్టించాడు. కానీ ఆ పాపకి పుట్టుకతోనే డ్రోన్ సైన్డ్రోమ్ అనే వ్యాధితో జన్మించడం జరిగింది. అయినప్పటికీ కంటికి రెప్పలా తన కూతుర్ని కాపాడుకుంటున్నా చిత్రమ్మ జీవితంలో మరోసారి ఆమె పెను తుఫాన్ లాగా ఓ సంఘటన చోటుచేసుకుంది.

అదేమిటంటే.. దుబాయిలో రెహమాన్ మ్యూజిక్ ట్రూప్ లో పాట పాడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్విమ్మింగ్ పూల్ లో చిత్రమ్మ పాప మునిగి అకాల మరణం చెందింది. ఆ సంఘటనతో మనోవేదనకు గురైన చిత్రమ్మ బ్రతికి ఉన్న జీవచ్ఛవంలా మిగిలిపోయింది. ఆ బాధతో కొంతకాలం కోమాలోకి వెళ్లిపోగా మళ్లీ తిరిగి మామూలు మనిషి అవ్వడానికి చాలా సమయం పట్టింది. అలా చిత్రమ్మ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆమె తండ్రి అలాగే కూతురు నందన మరణంతో ఆమె జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అలా పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే చిత్రమ్మ జీవితంలో తండ్రి, కూతురు మరణంతో ఎంతో విషాదం చోటుచేసుకుంది.