ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్… కొరటాల సినిమాలో ఎవరు ఊహించిన ట్విస్ట్..!

ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై ఇప్పటికి 8 నెలలు అవుతున్నా ఎన్టీఆర్- కొరటాల సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికీ మొదలు పెట్టలేదు. అభిమానులు కూడా ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ లో త్రిబుల్ ఆర్ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈనెల 21న జపాన్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఎన్టీఆర్- కొరటాల శివ సినిమాను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తారని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. అయితే త్రిబుల్ ఆర్ లో రోరింగ్ లుక్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల సినిమా కోసం తన మేక్ ఓవర్ ని మార్చుకుంటున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్ జీన్స్‌, టీ షర్ట్‌, మ్యాచింగ్‌ షూస్‌తో బ్లాక్‌ గాగుల్స్‌ పెట్టుకుని స్టైలిష్‌గా కెమెరాకు ఫోజులిచ్చాడు . ఆ లుక్‌ చూసి అందరూ కొర‌టాల‌ శివ సినిమా లో ఎన్టీఆర్ ఇలాగే కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్ లో పెడుతూ రచ్చ చేస్తున్నారు ఎన్టీఆర్‌ అభిమానులు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.