వారెవ్వా: నందమూరి అభిమానులకు పండగ చేసుకునే న్యూస్..బాలయ్య నువ్వు కేకోకేక..!!

2021 వ సంవత్సరం నుంచి నందమూరి అభిమానులకు స్వర్ణ యుగం నడుస్తుంది అనే చెప్పాలి. 2021 డిసెంబర్‌ లాక్ డౌన్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదలై ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఆ టైంలో థియేటర్స్ కి వస్తారా అన్న టైం లో అఖండ సినిమా ఏకంగా 150 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత నందమూరి మరో హీరో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Akhanda- IFFI Goa

ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ఫారెన్ కంట్రీ లో కూడా ఎన్నో సెన్సేషన్ రికార్డులను సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా జపాన్ లో విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో తీసుకుపోతుంది. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసారా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు నందమూరి హీరోల సినిమాలకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇక అసలు విషయానికి వస్తే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం గోవాలో జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో ఈ సంవత్సరం తెలుగు సినిమాల హవ ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ ఫెస్టివల్ నవంబర్ 20 నుండి 28 వరకు జరగనుంది.

ఈ ఫెస్టివల్‌లో మెయిన్ స్ట్రీమింగ్ సినిమాలలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా మరియు ఎన్టీఆర్ రామ్- చరణ్ హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలు అక్కడ ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని తెలుగు సినిమాల కూడా అక్కడ ప్రదర్శించబోతున్నారు. అయితే నందమూరి సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందటం .. అది కూడా బాలకృష్ణ సినిమా మెయిన్ స్ట్రీమింగ్ క్యాటగిరిలో అక్కడ ప్రదర్శించడం నందమూరి హీరోలకు మరో అరుదైన రికార్డు అనే చెప్పాలి.