తెలుగు రాష్ట్రాల్లో తగ్గని కాంతారా జోరు.. సర్దార్ కళ్లెం వేస్తాడా..!

దీపావళి కానకగా ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. విడుద‌లైన‌ నాలుగు సినిమాలు ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నాలుగు సినిమాలు కన్నా వారం ముందు విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా జోరుకి కళ్లెం పడలేదు. ఈ సినిమా మళ్లీ పుంజుకుని ఎనిమిదో రోజు కూడా కోటి రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది.

Kantara Telugu Release Date Locked: Check Reviews, BO Reports of this  Latest Kannada Hit - JanBharat Times

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయలకు అల్లు అరవింద్ దక్కించుకున్నాడు. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా అప్పటి నుంచి వరుసగా ఆరు రోజులు పాటు కోటి రూపాయలకు పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఏడో రోజు శుక్రవారం నాడు నాలుగు కొత్త సినిమాలు విడుదల కావడంతో కొంత కలెక్షన్ లో ఆ సినిమాలు ప్రభావం చూపించాయి. మళ్లీ 8వ రోజు 1.02 కోట్ల షేర్ తో మళ్లీ టాప్ ప్లెస్ లోకి వచ్చింది కాంతారా. ఈ సినిమా ఇప్ప‌టికే టాలీవుడ్ లో 12.38 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సినిమాకు ఇప్పటికే 10 కోట్లకు పైగా లాభాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈరోజు ఆదివారం రేపు దీపావళి కావడంతో రెండు రోజులు సెలవులు రావడంతో కాంతారా కలెక్షన్ జోరు మళ్లీ పెరిగింది.

Diwali Movies 2022 Telugu: బాక్సాఫీస్ వద్ద ఆ నాలుగు సినిమాలు ఎలా  ఉండబోతున్నాయి..? - OK Telugu

ఈ శుక్రవారం విడుదలైన నాలుగు సినిమాలలో కార్తీక్ నటించిన సర్దార్ సినిమా మాత్రమే ఎక్కువ కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమా మొదటిరోజు 95 లక్షల షేర్ ను రాబట్టింది. రెండు రోజు కోటి రూపాయలు షేర్ ను రాబట్టగా.. రెండు రోజుల్లోనే మూడు కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమాతో పాటు విడుదలైన ఓరి దేవుడా తొలిరోజు 90 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. రెండో రోజులో వచ్చేసరికి ఈ సినిమా 60 లక్షలు దగ్గర ఆగిపోయింది. ఈ సినిమా రెండు రోజులకి కేవలం ఒకటి 1. 50 కోట్ల షేర్ ను రాబట్టింది. మూడో సినిమా ‘ప్రిన్స్’ కూడా తోలి రోజు రూ.90 లక్షల షేర్ రాబట్టినప్పటికీ రెండో రోజు మాత్రం రూ.46 లక్షల షేర్ కి పడిపోయింది.

దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా రూ.1.36 కోట్ల షేర్ ద‌గ్గ‌ర అగిపోయింది. ఇక నాలుగో సినిమా ‘జిన్నా’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది, తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమా కేవ‌లం రూ.22 లక్షల షేర్ తో సరిపెట్టుకుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ నాలుగు సినిమాలలో కార్తీక్ నటించిన సర్దార్ సినిమా మాత్రం మంచి కలెక్షన్‌ల‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా అయినా కాంతారా కలెక్షన్ల ల‌ను తగ్గిస్తుందో లేదో చూడాలి.