అన్ స్టాపబుల్ షో కోసం అన్ స్టాపబుల్ గా పారితోషకం అందుకున్న బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంతో అద్భుతంగా కొనసాగుతున్నదో మనకి తెలిసిన విషయమే. ఒకపక్క సినిమాలలో నటిస్తు మరొకపక్క రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇలా హోస్టుగా చేస్తున్నారు బాలయ్య. ఇలా అన్నిటిని ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ బాగానే అభిమానులను అలరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బాలయ్య క్రేజ్ కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. ఆహ లో స్ట్రిమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తాజాగా అన్ స్టాపబుల్-2 ఇటీవల చాలా గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది.

Nandamuri Balakrishna And Shruti Haasan's Next Gets A New Title
ఇక అన్ స్టాపబుల్ కు సంబంధించి రెండవ సీజన్ కూడా మొదటి సీజన్ కు మించేలా ప్లాన్ చేశారు ఆహా బృందం. ఈ షోలో వ్యూస్ పరంగా మొదటి స్థానంలోకి దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. మొదటి ఎపిసోడ్ బాలయ్య అల్లుడు లోకేష్ తో పాటు నారా చంద్రబాబు నాయుడు ఈ షో కి అతిధిగా రావడం జరిగింది. ఈ షో మొదటి ఎపిసోడ్ మంచి సూపర్ హిట్ అయ్యింది. ఇక రెండో ఎపిసోడ్లో ఇద్దరు యంగ్ హీరోలను గెస్ట్ గా పిలిపించి బాలయ్య మరొకసారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లను ఇంటర్వ్యూ చేసి బాగా అదరగొట్టారని చెప్పవచ్చు.

Balakrishna's Unstoppable sets a new record - TeluguBulletin.com
ఇక మూడవ ఎపిసోడ్లు రమ్యకృష్ణతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదంతా ఇలా ఉండగా బాలయ్య సినిమాలకు రెమ్యూనికేషన్ కూడా ఈ మధ్యకాలంలో పెంచేశారు అనే టాక్ బాగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ టాక్ షో కోసం కూడా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి సీజన్ కి రూ.6 కోట్లు తీసుకోగా.. రెండవ సీజన్ కు వచ్చేసరికి రూ.9 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.