ఉల్లిపొర లాంటి చీర‌లో దాగ‌నంటున్న రాశీ అందాలు.. బాబోయ్ ఇంత హాట్‌గానా?!

రాశిఖన్నా.. 2013లో ‘మద్రాస్ కేఫ్’ అని హిందీ సినిమాతో అరంగేట్రం చేసి ఆ తరువాత 2014లో అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో తెరికెక్కిన `ఊహలు గుసగుసలాడే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక ఆ తరువాత బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, జోరు, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి మంచి స్టార్డం దక్కించుకుంది.

అంతేకాకుండా రాశిఖన్నా నటనతో పాటు తన గాత్రంతోనూ మంచి మార్కులు కొట్టేసింది. జోరు, జవాన్, ప్రతిరోజు పండగే వంటి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం రాశీ ఖన్నా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిలో లైట్ పింక్ కలర్ శారీలో మెరిసిపోతూ డోర్ వద్ద నిలుచుని తన అందాలతో కవ్విస్తూ మత్తెక్కించే ఫోజులిస్తుంది.

ఉల్లి పొర లాంటి చీరలో దాగనంటున్న రాశీ అందాలు ఇప్పుడు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాశిఖన్నా ఫోటోల కింద ఆసక్తికరమైన కామెంట్ చేసింది. దానిలో మీరు చిన్న సందర్శన కోసమే ఇక్కడ ఉన్నారు. “ఈ దారిలో పువ్వుల సువాసన కచ్చితంగా ఆస్వాదించండి“ అంటూ పోస్ట్ పెట్టడం విశేషం. రాశిఖన్నా తాజాగా నటించిన `సర్దార్` మూవీ అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో `యోధ` అనే సినిమా అలాగే `ఫర్జీ` అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.