ప్రభాస్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్..కళ్ల ముందే కాలి బూడిదైన థియేటర్..!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బిల్లా సినిమాను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా ధియేటర్లో సందడి చేస్తుంది. ఆయన ఫాన్స్ హడావుడి మామూలుగా లేదు.. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు చేసిన అత్యుత్సాహంతో బిల్లా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో మంటలు వచ్చాయి. అక్కడ ఉన్న థియేటర్స్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇక వివరాల్లోకి వెళ్లితే.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో బిల్లా స్పెషల్ షోనీ వేశారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకను థియేటర్లో ఘనంగా నిర్వహించి థియేటర్లో భారీ కేక్‌ను కట్ చేశారు. ఇక అప్పుడే అక్కడ ఉన్న కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్ లోపల బాణాసంచా కాల్చారు. అక్కడ ఉన్న సీట్లకు మంటలు అంటుకున్నాయి.

మరోవైపు కేక్‌ మీద ఉన్న క్యాండిల్ సీట్ల మధ్యలో పడీ అక్కడ కూడా మంటలు వచ్చాయి. అప్పుడే ఒక్కసారిగా థియేటర్లో మంటలు రావడంతో అక్కడున్న ప్రేక్షకులు కొంత భయాందోళనలకు గురయ్యారు. థియేటర్ నుంచి బయటికి పరుగులు తీశారు. థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి.. అక్కడ ఉన్న కొంతమంది అభిమానులు థియేటర్ సిబ్బందితో కలిసి ఆ మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.