స్టార్ హీరో నాగచైతన్య అని పరిగెత్తించి కొట్టిన గ్రామస్తులు… అసలు విషయం ఏమిటంటే..!

నాగచైతన్య హీరోగా తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మెల్కోటే గుడి ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఉన్న చారిత్రక కట్టడాలైన దేవాలయాలలో ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం అని ప్రసిద్ధ రాయగోపుర దేవాలయ దగ్గరలో ఓ బార్‌కు సంబంధించిన సెట్ వేశారు. ఆ సెట్‌లో షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇంతలో అది చూసిన గ్రామస్తులు వాళ్ల మీద కోపంతో ఈ సినిమా యూనిట్ పై కోపంతో దాడికి దిగారని తెలుస్తుంది.

Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi - Bilingual Film  Announced | Telugu Movie News - Times of India

దీనికి కారణం వీరు షూటింగ్ చేసే ప్రాంతానికి పక్కన ఉన్న ఎంతో చరిత్ర కలిగిన రాయగోపురంలో బార్ లాంటి సెట్ వేసి ఇక్కడ ఉన్న ప్రజల మనో భావాలను దెబ్బతీశారని… అక్కడ ఉన్న ప్రజలు ఆ షూటింగ్ అడ్డుకున్నారు. దీంతో అక్కడి ప్రజలు కోపంతో ఆ షూటింగ్ చేసే ప్రదేశాన్ని ధ్వంసం చేసి అక్కడున్న వారిని పరిగెత్తించి మరీ కొట్టారు. ఆ టైంలో నాగచైతన్య కూడా అక్కడే ఉన్నాడట.

ఇక వీళ్ళు ఇక్కడ నిబంధనకు విరుద్ధంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూ సినిమా షూటింగులు చేస్తున్నారని.. వీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలు సినిమాల షూటింగ్ సమయంలో ఇక్కడ ఉన్న వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ అక్కడ ప్రజలు విమర్శలు కుప్పించారు. ఇప్పటినుంచి ఇక్కడ ఎటువంటి షూటింగ్లకు అనుమాతలు ఇవ్వకూడదని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.