ఆ హీరోకి రష్మిక ఆ విధంగా సహాయం చేసిందా.. నిజమేనా..?

రష్మిక, విజయ్ దేవరకొండ ఈ పేర్లు సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎయిర్ పోర్టు లో వీరిద్దరూ కలిసి కనిపించారు అంటూ పలు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వాస్తవానికి వీరిద్దరూ ప్రేమ పక్షులు అనే విషయం టాలీవుడ్ లో దాదాపుగా అందరూ కూడా ఫిక్స్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్ని మాత్రం వీరిద్దరూ నేరుగా ఒప్పుకోలేదు. ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకుంటూ ఆర్థిక కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Rashmika Mandanna on her relationship with Vijay Deverkonda: 'I see what's  happening on social media, find it very cute…' | Entertainment News,The  Indian Express

ఇక అంతే కాకుండా వీరిద్దరూ తాజాగా మాల్దీవ్ ట్రిప్ కు వెళ్లడమ్ జరిగింది అన్నట్లుగా పలు కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక తెలుగులో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో బిజీగా ఉన్నది. అలా ఎక్కడ చూసినా బాగానే సంపాదిస్తోంది. రష్మిక రేంజ్ పుష్ప సినిమా తో పెరిగిపోయింది. ఇక విజయ్ దేవరకొండ పరిస్థితి ఎలా ఉందో మనకి తెలిసిందె.. ఈయన తీసిన చిత్రాలు అన్ని కూడా ఫ్లాపులుగా మిగిలాయి.ఇదంతా చాలదు ఆన్నట్లుగా లైగర్ సినిమాతో ఘోరమైన పరాజయాన్ని చూశారు. దాంతో ఈ సినిమాకు అందుకున్న రెమ్యూనరేషన్ కోట్లల్లో వెనక్కి ఇవ్వవలసి వచ్చిందట.

Rashmika Mandanna, Vijay Devarakonda Spotted Together On 'Funday'
అయితే విజయ్ దేవరకొండ ఆ మధ్య కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక బంగ్లా కొన్నాడని వార్తలు వినిపించాయి. అయితే అందుకు విజయ్ కి సపోర్టుగా రష్మిక నిలిచింది అని వార్తలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి. సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ దగ్గర డబ్బులు తక్కువగా ఉండడంతో రష్మిక సహాయం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ వంటి హీరో వెనుక రష్మిక లాంటి ఒక స్టార్ హీరోయిన్ ఉండడం నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి వీరి ప్రేమ వ్యవహారం నిజమో కాదో తెలియాలి అంటే విరే స్పందించాలి..