ఆ తప్పే సావిత్రిని అబద్దాల కోరి గా నిలబెట్టిందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ఎంతోమంది నటీమణులకు ఈమె ఒక ఆదర్శం. ఇక సావిత్రిని చూసి సినిమాల్లోకి వచ్చిన ఎంతోమంది నటీమణులు కూడా లేకపోలేదు . ఎలా బ్రతకాలో ? ఎలా బ్రతకకూడదో? ఎవరితో ఎలా ప్రవర్తించాలో? ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఇలా ప్రతి విషయంలో కూడా ఆమె ఎంతో మందికి ఆదర్శమని చెప్పాలి. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆమె తన జీవితంలో చేసిన తప్పులే ఆమెను అబద్దాల కోరిగా నిలబెట్టాయి. ఇక ఆమె జీవితం మంచి చెడుల సమ్మేళనం.. తప్పు ఒప్పులకు మధ్య నలిగిపోయిన ఒక తెగిన గాలిపటం.

5. Savitri - Mahanati ( Great Actress ) - The Journey of a Legend

ఏది తప్పు.. ఏది ఒప్పు అని చెప్పడానికి కూడా ఎవ్వరికీ అర్హత కానీ.. అనుభవం కానీ లేవు.. ఎంతగానో స్థానం అనుభవించి.. ఎన్నో వందల కోట్లు సంపాదించి చివరికి చనిపోయేటప్పుడు ఒంటిమీద కండ కూడా లేకుండా అస్తిపంజరంలా కన్ను మూసింది.. ఇక సావిత్రికి ఉన్న మందు అలవాటు గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా తాగినా.. తాగకపోయినా చాలా నిజాయితీగా ఉండేవారు. ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పేవారు కాదు.. అంతే కాదు మాట మార్చడం అనేది ఆమెకు తెలియదు.. నిజానికి నిలువెత్తు నిదర్శనం అయిన సావిత్రి ఒకానొక సమయంలో తాగిన మైకంలో చేసిన ఒక పని వల్ల అబద్దాలకోరుగా మాట పడిపోయింది.

Mahanati Savitri: Fans from abroad for Mahanati Savitri at that time ..  Rare photo circled on social media .. | Actress savitri rare photo: savitri  with malaysian fans in saree photo hulchul

అసలు విషయంలోకెళితే .. ఒకసారి సరోజినీ దేవితో కూర్చొని ఆమె మందు తాగుతోంది. ఆ సమయంలో సావిత్రి మెడలో ఉన్న రవ్వల నెక్లెస్ ని చూసి ఆమె ముచ్చట పడింది. ఎంతో బాగుంది అంటూ కితాబు ఇచ్చింది . అంతటితో ఊరుకోలేదు సరోజినీ దేవి.. ఒకసారి ఇస్తావా పెట్టుకుని చూస్తాను అని సావిత్రిని అడిగిందట సరోజినీ దేవి.. ఇక తన మెడలో ఉన్న నక్లెస్ తీసి సరోజినీ చేతిలో పెట్టి.. పెట్టుకొని చూడడం కాదు ఒకసారి వాడుకొని తెచ్చి మళ్ళీ ఇవ్వు అని చెప్పిందట. ఇక ఆ రోజుల్లో రవ్వల నెక్లెస్ అంటే కొన్ని లక్షల రూపాయల విలువ ఉంటుంది. అయితే ఆ తర్వాత మళ్లీ సరోజిని సావిత్రి కష్ట కాలంలో ఉన్న సమయంలో తన నక్లెస్ గురించి అడగ్గా.. నాకు నువ్వు ఇవ్వలేదు.. అసలు ఆ నెక్లెస్ గురించి నాకు తెలియదు.. నాకు ఇచ్చినట్టుగా అబద్ధం చెబుతావా అంటూ సరోజినీ దేవి మాట మార్చేశారు. నిజానికి సరోజినీ దేవి ఒక దొంగా అని అందరికీ తెలిసినప్పటికీ.. సావిత్రిని మాత్రం అబద్దాలకోరుగా నిలబెట్టింది.కానీ సావిత్రి లాంటి గొప్ప వ్యక్తిని కూడా అబద్దాల కోరిగా మార్చింది సరోజినీ దేవి.