ప్రకాశంలో భారీ ట్విస్ట్..బడా నేతల సీట్లు చేంజ్..!

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న జగన్..ఈ సారి పార్టీలో ఊహించని మార్పులు చేయడానికి సిద్ధం అవుతున్నారు…ఈ సారి ఖచ్చితంగా గెలవాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సీట్లని మార్చాలని చూస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆయా ఎమ్మెల్యేలు ఉన్నచోట టీడీపీ నేతల బలం కూడా పెరుగుతుంది.

అందుకే జగన్ కొన్ని మార్పులు చేయాలని చూస్తున్నారు..ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఊహించని మార్పులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది. కీలక నియోజకవర్గాల్లో నేతలని మారుస్తారని ప్రచారం వస్తుంది. అది కూడా ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీటు మార్చుకుంటారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని నాలుగుసార్లు గెలిచిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కూడా సత్తా చాటి..మంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత మంత్రి పదవి పోయాక..కాస్త అధిష్టానంపై అసంతృప్తితోనే ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ఒంగోలు అసెంబ్లీలో బాలినేనికి అంత అనుకూల వాతావరణం లేదని సర్వేల్లో తేలింది. ఇక్కడ టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ స్ట్రాంగ్ అవుతున్నారు..పైగా కమ్మ సామాజికవర్గం కాస్త బలంగా ఉండే స్థానం కూడా. అందుకే బాలినేని ఒంగోలు నుంచి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారని, ఈ సారికి ఆయన గిద్దలూరు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

ఇక ఒంగోలు నుంచి కరణం బలరామ్ వారసుడు వెంకటేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు..మార్కాపురం స్థానం బరిలో ఉంటారని అంటున్నారు. ఇటు చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ పోటీకి దిగుతారని ప్రచారం ఉంది. మొత్తానికి ప్రకాశం జిల్లా వైసీపీలో భారీ మార్పులు జరిగేలా ఉన్నాయి. మరి ఈ మార్పులు నిజమవుతాయో లేదో చూడాలి.