ఉదయ్ కిరణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన సుదీప.. అలా చేశాడంటూ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన నటనతో మాటలతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ ని ఉద్దేశిస్తూ బిగ్ బాస్ సుదీప పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హౌస్ నుండి బయటకు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి పలు విషయాలు తెలిపింది వాటి గురించి తెలుసుకుందాం.

Bigg Boss 6 Telugu: Sudeepa Pinky Interesting Comments About Uday Kiran -  Sakshi
7/G బృందావన కాలనీ ,నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలలో నటించిన సుదీప బాగా సుపరిచితమే ఈమె నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో పింకీ గా బాగా పాపులర్ అయింది. ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తో 5 చిత్రాలకు తాను సైన్ చేసినట్లుగా తెలియజేసింది సుదీప. ఉదయ్ కిరణ్ హీరోగా ఒకేసారి 9 చిత్రాలు ప్రారంభమయ్యాయి. అయితే వాటిలో చాలా ఆగిపోయాయి. ఐదు చిత్రాలలో తను కూడా ఉన్నట్లు తెలియజేసింది. ఉదయ్ కిరణ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉండేవారు. కాస్త డల్ గా కనిపిస్తే దగ్గరకొచ్చి ఏమైంది అని అడిగే వారిని తెలిపింది సుదీప.

Sudeepa Pinky Family Husband Biography Parents children's Marriage Photos
ఒకరి బాధను పసిగట్టి ఓదార్చే తత్వం గల వ్యక్తి ఉదయ్ కిరణ్ ఆని తెలియజేసింది. అయితే ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోని అందరిని వదిలి వెళ్ళిపోయారు.ఉదయ్ కిరణ్ లేకున్నా అందరి మనసులో ఆయన నటన అలాగే ఉండిపోయింది అని ఎమోషనల్ తెలిపింది సుదీప. ఇక ఉదయ్ కిరణ్ సుదీప కలిసి చివరిగా నటించిన చిత్రం వియ్యాలవారి కయ్యాలు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.