టీడీపీ త్యాగం..ఏలూరు జనసేనకే?

టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైపోయినట్లే అని రెండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ బట్టి చూస్తే..ఇద్దరు నేతలు పొత్తుకు రెడీగా ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధికారికంగా ఎన్నికల ముందే పొత్తు గురించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పొత్తు ఉంటే కొన్ని సీట్లలో వైసీపీకి రిస్క్ తప్పదు. అదే సమయంలో టీడీపీ కొన్ని సీట్లని త్యాగం చేయాల్సి వస్తుంది. జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి.

జనసేనకు ఎలాగో 175 స్థానాల్లో నాయకులు లేరు..కానీ టీడీపీకి ఉన్నారు. అందుకే టీడీపీకి త్యాగం చేయక తప్పదు. ముఖ్యంగా విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో టీడీపీ నేతలు కాస్త ఎక్కువ త్యాగం చేయాలి. ఇదే క్రమంలో ఏలూరు అసెంబ్లీ సీటుని సైతం జనసేనకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు సీట్లు ఉన్నాయి. ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు, ఏలూరు సీట్లు ఉన్నాయి. వీటిల్లో కైకలూరు, ఏలూరు సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేవలం ఒక్క సీటు మాత్రమే జనసేన తీసుకునే ఛాన్స్ లేదు. అలా అని వైసీపీ బలంగా ఉన్న చింతలపూడి, పోలవరం సీట్లు జనసేన తీసుకోవడం కష్టమే. ఉంగుటూరు, దెందులూరు, నూజివీడు సీట్లు టీడీపీ వదులుకోదు..ఇక కైకలూరు, ఏలూరు స్థానాల్లోనే జనసేనకు కాస్త బలం కనిపిస్తోంది. గెలిచెంత బలం లేదు గాని..టీడీపీ సపోర్ట్ ఉంటే జనసేన గెలుస్తుంది.

అయితే ఇందులో కైకలూరు జనసేనకు ఇచ్చేస్తారు. మరి ఏలూరు సీటు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంచార్జ్ గా బడేటి చంటి ఉన్నారు. ఆయన బాగానే కష్టపడుతున్నారు. కాకపోతే అనుకున్న మేర బలపడలేదు. అలాగే ఇక్కడ జనసేన సపోర్ట్ లేనిదే టీడీపీ గెలవలేదు. పైగా ఇక్కడ జనసేన బలపడుతుంది. అందుకే ఈ సీటు అడుగుతున్నట్లు తెలిసింది. పరిస్తితులని బట్టి చూస్తే ఈ సీటు టీడీపీ త్యాగం చేసి..జనసేనకు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.