పూర్ణ నిజంగా లక్కీనే.. పెళ్లిలో భర్త నుంచి ఎన్ని కేజీల బంగారాన్ని గిఫ్ట్ గా కొట్టేసిందో తెలుసా?

నటి పూర్ణ… ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. చూడగానే తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ మలయాళ నటి తెలుగులో మహాలక్ష్మి, అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా తరికెక్కిన `అఖండ` సినిమాలో పూర్ణ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమయ్యే `ఢీ జోడిలో` జడ్జిగా అలాగే అవకాశాలు ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ కెరీర్లో రాణిస్తుంది.

ప్రస్తుతం పూర్ణ పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆమె మే నెలలో తన ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన నెలరోజులకే ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇటీవల బయట పెట్టింది. పూర్ణ దుబాయ్ స్టార్ బిజినెస్ మ్యాన్ షనీద్ అసిఫ్ అలీనీ జూన్ లో పెళ్లి చేసుకుందట.

అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఎవరిని పిలవలేదని ఇక త్వరలోనే తన స్నేహితులకు, సెలబ్రిటీలకు కేరళలో గ్రాండ్ గా రిసెప్షన్ పెట్టి పార్టీ ఇస్తామని చెప్పుకొచ్చింది. అయితే దీపావళి పండుగ సందర్భంగా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక అసలు విషయం ఏమిటంటే పూర్ణ పెళ్లికి సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పూర్ణ భర్త పెళ్లిలో దాదాపు 1700 గ్రాముల బంగారాన్ని పూర్ణకి గిఫ్ట్ ఇచ్చాడట. అంతేకాకుండా తన భార్య కోసం ఒక లగ్జరీ హౌస్ ని కూడా తన పేరు మీద రాసి పెళ్లి గిఫ్ట్ గా అందించాడని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన వారందరూ పూర్ణ నిజంగా లక్కీనే.. బోల్డంత బంగారం గిఫ్ట్ గా కొట్టేసిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది.