ముందస్తుకు రెడీ..ఆ ఇంచార్జ్‌లకు షాక్?

టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు..గత రెండేళ్లుగా బాబు ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉందని, దానికి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెబుతూనే ఉన్నారు. కానీ తాము నిర్ణీత కాలం వరకు అధికారంలో ఉంటామని, ఐదేళ్లు ఉంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ముందస్తుకు వెళ్ళే ప్రసక్తి లేదని అంటున్నారు. కానీ బాబు మాత్రం జగన్ ముందస్తుకు వెళ్తారని బాగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

తాజాగా కూడా ముందస్తు గురించి మరోసారి మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇదే క్రమంలో పార్టీ ఇంచార్జ్‌లకు వార్నింగ్ ఇచ్చారు. గెలుస్తామన్న నమ్మకం కలిగించిన వారికే టికెట్లు వస్తాయని, ఇన్‌చార్జులు నమ్మకం కలిగించలేకపోతే వేరే నిర్ణయాలు ఉంటాయని గట్టిగా చెప్పేశారు. వైసీపీ అన్నీ రంగాల్లో ఫెయిల్ అయిందని, అయినా ఆ పార్టీ అసత్య ప్రచారానికి దిగిందని, దీనిని మనం గట్టిగా తిప్పికొట్టాలని బాబు నేతలకు సూచించారు.

అయితే ఇందులో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో.. ఎవరు లేరో కూడా తన వద్ద లెక్కలున్నాయని చెప్పుకొచ్చారు. ఇలా ముందస్తు ఎన్నికల గురించి చెబుతూనే, సరిగ్గా పనిచేయకపోతే ఇంచార్జ్‌లకు సీటు కూడా ఇవ్వననే విధంగా బాబు వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే ముందస్తుకు వెళ్ళమని వైసీపీ చెబుతున్నా సరే..బాబు మాత్రం ముందస్తుపై టీడీపీ నేతలకు అలెర్ట్ ఇస్తున్నారు.

అంటే టీడీపీ నేతలని బాగా యాక్టివ్‌గా ఉంటారని చెబుతున్నారా? లేక నిజంగానే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అనేది క్లారిటీ లేకుండా ఉంది. ప్రస్తుతానికి ముందస్తుపై క్లారిటీ లేదు కాబట్టి..టీడీపీ నేతలని యాక్టివ్‌గా ఉంచడానికే బాబు పదే పదే ముందస్తు ఎన్నికలకు రెడీ ఉండాలని నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే సరిగ్గా చూసుకుంటే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..ఈలోపు ఎంతమంది టీడీపీ ఇంచార్జ్‌లు పూర్తి స్థాయిలో పికప్ అవుతారో చూడాలి. అలాగే బాబు ఎంతమందికి సీటు ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తారో చూడాలి.