‘ఆహా’ బాలయ్యతో అదిరిపోయే ప్లాన్…దీంతో అల్లు అరవింద్ మరో లెవల్ కి వెళ్లినట్టే..!

బాలకృష్ణ మొదటిసారిగా చేసిన టాక్ షో అన్ స్టాపబుల్ ఇది ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ షో ఎవరు ఊహించిన విధంగా భారీ సక్సెస్ సాధించింది. ఈ షో తో బాలయ్యకు యూత్ లో కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. తాజాగా ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలు కాబోతుంది. దీనికి సంబంధించిన పనులు చక చక జరగబోతున్నాయి. అయితే తాజాగా సీజన్ 2కు స‌బంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆహా ఈ సీజన్2 నీ మొదలు పెట్టడానికి భారీ ప్లానింగ్ చేస్తుంది. మొదటిసారిగా ఓటీటీలో కార్యక్రమానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతుంది. దసరాకి ముందు రోజు విజయవాడలో భారీ బహిరంగ సభ పెట్టి ఆహా అన్ స్టాపబుల్ సీజన్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గా విజయవాడలో ఏర్పాట్లు చాలా చురుగ్గా జరుగుతున్నాయి.

Blockbuster duo Nandamuri Balakrishna and Prashant Verma are back for ‘Unstoppable with NBK 2’

అయితే ఈ షోకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ సాంగ్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఈ సాంగ్ కి స్పెషల్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్లో బాలయ్య కౌబాయ్ గెటప్ లో ఉన్న ఒక ఫోటో బయటకు వచ్చింది. దీనితోనే మరోవైపు ఈ సీజన్ కి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా కొనసాగిస్తున్నాడు బాలయ్య. ఈ సీజన్ 2 కోసం చాలా గట్టిగా ప్లైన్ చేస్తుంది, ఆహా తొలి సీజన్ కు ఉన్న‌రైటింగ్ టీమ్ నే ఈ సీజన్ కూడాా తీసుకున్నారు. ఈ సీజన్లో చంద్రబాబు- లోకేష్, త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ వంటి కాంబినేషన్‌లు సెట్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తుంది.

Unstoppable 2: NBK is back | cinejosh.com

ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ గా బాలయ్య తన బావమరిది అయిన చంద్రబాబు, అల్లుడు లోకేష్ తో ఇంటర్వ్యూ ను మొదలుపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ గా ప్రసారం అవుతుందో లేదో ఇంకా అధికార ప్రకటన రాలేదు.నిజానికి సీజన్-2 ఫస్ట్ ఎపిసోడ్ ను చిరంజీవితో ప్లాన్ చేయాలని అనుకున్నారు. అన్ స్టాపబుల్ క్రియేటివ్ హెడ్ అబ్బూరి రవి కూడా గతంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పటివరకు చిరంజీవితో ఇంటర్వ్యూ పూర్తిచేయలేదు.