లక్ష్మీపార్వతికి ఒక ఓటు మారుతుందా?

మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు..ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులే కాదు..ఎన్టీఆర్‌ని అభిమానించే ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి వైసీపీలో కొందరు నేతలు సైతం అసందర్భంగా పేరు మార్చడంపై అసంతృప్తిగానే ఉన్నారు. సరే ఏదైతే ఏముంది..పేరు మార్పుపై టీడీపీ పోరాటం చేస్తుంది. ఇదే సమయంలో లక్ష్మీపార్వతి స్పందిస్తూ..జగన్‌ నిర్ణయాన్ని సమర్ధించారు. జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారని, యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దది అని ఏదో కవర్ చేసుకొచ్చారు.

రాష్ట్రంలో జిల్లాలు చాలా ఉంటాయి..కానీ హెల్త్ యూనివర్సిటీ ఒకటే ఉంటుంది..అది కూడా ఇండియాలో  టాప్ మోస్ట్ యూనివర్సిటీ. అలాంటి దానికి ఎన్టీఆర్ పేరు తీసేస్తే తప్పు కాదని, జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారని లక్ష్మీపార్వతి..జగన్‌కు సపోర్ట్ చేసింది. ఇక ఇదే పేరు మార్పు గురించి చెప్పిన విషయం..ఇక యథాతథంగా..ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు అని, అలాగే ఫ్యామిలీ పట్టించుకోలేదని, తన వల్లే ఎన్టీఆర్ గెలిచారని, ఆరోగ్యంగా ఉన్నారని..ఇంకా పాత విషయాలని మొత్తం చెప్పుకొచ్చారు.

వీటిల్లో నిజాలు ఏంటో…అబద్దాలు ఏంటో ప్రజలకు తెలుసు. కానీ జగన్‌ని ఏదో కవర్ చేసుకోద్దామని లక్ష్మీపార్వతి గట్టిగానే ట్రై చేశారు. ఇక ఆమెకు టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చేసింది.  ఎంగిలి మెతుకులకు ఆశపడి సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నారని లక్ష్మీపార్వతిపై ఫైర్ అవుతున్నారు. ఇలా ఆమెపై టీడీపీ శ్రేణులు గట్టిగానే ఫైర్ అవుతున్నాయి. ఆశలు లక్ష్మీపార్వతి లేకపోతే ఎన్టీఆర్‌కు ఆ పరిస్తితి వచ్చేది కాదని మాట్లాడుతున్నారు.

అయితే లక్ష్మీపార్వతి ఆద్యంతం చంద్రబాబు టార్గెట్ గానే మాట్లాడారు. అలా పాత విషయాలని ఏదో కల్పించుకుని చెప్పడం వల్ల వైసీపీకి ఒక ఓటు పెరగదు..టీడీపీకి ఒక ఓటు తగ్గదు. అసలు లక్ష్మీపార్వతి మాటలని నమ్మేది ఎవరు అనేది కూడా డౌటే అని విశ్లేషకులు అంటున్నారు. ఆమె మాటలని వైసీపీ వల్లే నమ్మరని చెబుతున్నారు. మొత్తానికి లక్ష్మీపార్వతి వల్ల వైసీపీకి ఒరిగేది ఏమి లేదని అంటున్నారు.