లక్ష్మీపార్వతి గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!!

కేవలం తెలుగు సినిమా తెరపై మాత్రమే కాకుండా రాజకీయ రంగంపై కూడా చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇకపోతే అప్పటికే బసవతారకంతో 12 మంది పిల్లలకు జన్మనిచ్చి వారిని ప్రయోజకులుగా చేసిన సీనియర్ ఎన్టీఆర్ ఆమె చనిపోయిన తర్వాత లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకోవడం జరిగింది.. తర్వాత టిడిపి నుంచి ఎన్టీఆర్ ను వెళ్ళగొట్టడం.. చంద్రబాబు హస్తగతం చేసుకోవడం.. ఆ బాధలోనే ఎన్టీఆర్ మరణించడం అన్నీ కూడా తెలుగు చరిత్రలో విషాద గాధ గా మిగిలిపోయాయి.. బసవతారకంతో 12 మందిని కన్న ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి తో కూడా ఒక బిడ్డకు తండ్రి అయ్యేవాడే.. ఈ క్రమంలోనే ఈమెను గర్భవతిని కూడా చేశాడు . కానీ ఆ వయసులో బిడ్డను కనడం సమంజసం కాదని వద్దనుకున్నామని లక్ష్మీపార్వతి సంచలన నిజాలు బయటకు పెట్టింది.

South News | Latest South News | South News Today

ఇకపోతే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో మాట్లాడిన లక్ష్మీపార్వతి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇకపోతే లక్ష్మీపార్వతి తో తనకు ఒక బిడ్డ కావాలి అని ఎన్టీఆర్ స్వయంగా అడిగాడని , అందుకు లక్ష్మీపార్వతి మీ ఇష్టం స్వామి మీరేం చేయమంటే నేను అది చేస్తాను అని అన్నానని లక్ష్మీపార్వతి ఆ వీడియోలో తెలిపింది . ఇకపోతే ఈ క్రమంలోనే తాను గర్భవతి అయ్యాను అని కానీ నాడు ఎందుకో ఎన్టీఆర్ వద్దనుకొని గవర్నమెంట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. ఇలా అబార్షన్ చేయించడానికి కారణం ప్రభుత్వం తోపాటు అధికారం పడిపోవడం , వయసు పైబడటం.. ఇన్ని కష్టాల మధ్యన ఈ వయసులో బిడ్డను కనడం మంచిది కాదని మూడు నెలల గర్భం ఉన్నప్పుడు అబార్షన్ చేయించాడని లక్ష్మీపార్వతి అసలు విషయాన్ని బయట పెట్టింది.

ఒకవేళ ఎన్టీఆర్ కు లక్ష్మీపార్వతికి మధ్య ఈ బిడ్డ జన్మించి ఉంటే ఎన్టీఆర్ 13వ సంతానంగా అతడికి కూడా అధికారం లభించేది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది చంద్రబాబు కి బుల్లి బామ్మర్ది, బాలయ్యకు చిన్ని తమ్ముడు అంటూ రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు ..అంతేకాదు అన్నింటికీ మించి తెలుగుదేశం పార్టీకి భావి అధ్యక్షుడు పాపం మిస్ క్యారీ అవ్వడంతో మిస్ అయ్యాడు.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారుతోంది.