వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మూడు రాజధా నులు.. అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా తాను చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక గత ప్రభుత్వానికి .. తన ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ఇలా.. దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేతలను ముందుకు కదిలిస్తున్నారు.
ప్రజలతో కలిసేలా.. గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ చిత్రమైన సంగతు లు తెరమీదికి వచ్చాయి. ఓ కీలక సామాజిక వర్గంపై.. ప్రజల్లో విరక్తి కలిగేలా.. వారు చేసిన.. చేస్తున్న వ్యూహాలను.. తద్వారా.. ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించాలనేది.. జగన్ వ్యూహం. ఇప్పటికి.. తాను చేస్తున్నది అదేనంటూ.. జగన్ తన వారికి చెబుతున్నారు. ఆ సామాజికవర్గం.. పట్ల ప్రజల్లో సానుభూతి తగ్గిపోవాలనేది జగన్పెట్టిన షరతు.
దీనికి సంబంధించి నేతలు ఏం చేసినా.. తాము అండగా ఉంటామని కూడా.. జగన్ హామీ ఇచ్చినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో నేతలపై సదరు సామాజిక వర్గంపై విరుచుకుపడాలని.. అత్యంత ముఖ్యమైన సలహాదారు నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే.. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు మాత్రం.. దీనికి పెద్దగా మొగ్గు చూపడం లేదు. “ఏదైనా ఉంటే ప్రజలు తేల్చుకుంటారు. మాకు అన్ని వర్గాలు సమానమే. వారు కూడా మాకు ఓట్లేశారు“ అని నాయకులు తేల్చి చెబుతున్నారు.
కానీ.. సలహాదారు మాత్రం.. సదరు సామాజిక వర్గంపై ఏదైనా ప్రచారం చేయండి.. ఇది అధినేత మాట. అని నిత్యం ఫోన్లు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు.. ఏం చేయాలో తెలియక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి టాస్క్ పూర్తి చేయకపోతే.. టికెట్ కూడా కష్టమేనని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు కింకర్తవ్యం అని అంతర్మథనం చెందుతున్నారు. మరి ఏం చేస్తారో ? చూడాలి.