మంత్రుల సీట్లు చేంజ్..!

ఎప్పుడైతే జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వనని చెప్పారో అప్పటినుంచి వైసీపీలో గందరగోళ పరిస్తితులు ఉన్నాయి..ఎవరి సీటుకు ఎసరు వస్తుందనే టెన్షన్ ఎమ్మెల్యేల్లో ఉంది. అయితే ఈ మధ్య పీకే టీం సర్వే అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం వైసీపీలో 70 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, ఇందులో దాదాపు 40-50 మంది సీట్లకు ఇచ్చే అవకాశాలు లేవని తెలిసింది.

అయితే ఈ కథనం నిజమో కాదో పక్కన పెడితే…అసలు అంతమంది ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకపోతే వైసీపీకే నష్టం. ఏదో 20 మంది వరకు అంటే ఓకే గాని…అంతమంది ఎమ్మెల్యేలౌ ఇవ్వకపోతే అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయిలో వెళ్తాయి. దీని వల్ల వైసీపీకి భారీ నష్టం. ఈ క్రమంలోనే జగన్ మరో మార్గంలో ఈ సమస్యకు పరిష్కారం చూపనున్నారని కథనాలు కూడా వస్తున్నాయి. అంటే ఎమ్మెల్యేలని వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేయడమే..దీనికి పరిష్కారం అని తెలుస్తోంది.

ఉదాహరణకు మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయనకు మళ్ళీ సీటు ఇస్తే గెలుపు కష్టమని సర్వేల్లో తేలింది. అలా అని ఆయనకు సీటు ఇవ్వకపోతే బాగోదు…ఎందుకంటే ఆయన..జగన్‌కు సన్నిహితుడు…పైగా గత ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారు…కానీ ఇవ్వలేదు. ఇప్పుడు సీటు కూడా ఇవ్వకపోతే వైసీపీకే నష్టం. అందుకే ఆయన్ని ఈ సారి మంగళగిరి నుంచి కాకుండా సత్తెనపల్లి బరిలో దింపుతారని తెలిసింది.

అటు సత్తెనపల్లిలో ఉన్న మంత్రి అంబటి రాంబాబుని అవనిగడ్డ బరిలో నిలబెడతారట. అంటే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబుకు సీటు లేదు. ఇక మంత్రుల్లో అంబటి మాత్రమే కాదు..కళ్యాణదుర్గంలో ఉన్న మంత్రి ఉషశ్రీ చరణ్‌ని…హిందూపురం, అనకాపల్లిలో ఉన్న అమర్నాథ్‌ని..గాజువాక, పెడనలో ఉన్న జోగి రమేష్‌ని కైకలూరుకు పంపిస్తారని తెలుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.