హీరో దళపతి విజయ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన బిగిల్ సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృత అయ్యారు. ఇక ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత ప్రదీప్ తో కలసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత హీరో రామ్ నటించిన రెడ్ సినిమాలో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో తేజ సజ్జ సరసన హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రానికి హనుమాన్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక విషయంలో చాలా వైరల్ గా మారుతోంది. వాటి గురించి చూద్దాం.తాజాగా అమృత అయ్యారుకు వివాహమైందని వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. కనీసం అభిమానులకు చెప్పకుండా ఇమే ఇంత తొందరగా వివాహం చేసుకుందాం అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలపై అమృత అయ్యర్ స్పందించడం జరిగింది.తన పెళ్లి అయిపోయింది అంటూ వస్తున్న వార్తలపై అమృత స్పందిస్తూ అవన్నీ ఒట్టి పుకార్లే అని తెలియజేసింది. అయితే రూమర్స్ రావడానికి కారణమైన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేసింది తను గతంలో నటించిన “వణక్కమ్ దా మాప్పిలై” అనే సినిమాలోని స్టిల్స్ అని తెలియజేసింది. అయితే ఈ ఫోటోలోని పెళ్లి అయ్యిందని వార్తలను సృష్టించారని చెప్పుకొచ్చింది అమృత అయ్యర్. అయితే తన పక్కన ఉన్న వరుడుని కట్ చేసి కేవలం తన ఫోటోలను మాత్రమే షేర్ చేయడంతో అభిమానులు నిజంగానే వివాహమైందని భావించారు. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ.