కడపపై బాబు ఫోకస్…ఆ సీట్లు ఫిక్స్?

చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే…ఇక్కడ పూర్తి ఆధిక్యం వైసీపీకే ఉంది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంని సైతం గెలుచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు…జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెడుతున్నారు. మామూలుగా కడప అంటే వైసీపీ అడ్డా…ఇక్కడ టీడీపీ గెలుపు చాలా కష్టమైన విషయం.

కానీ ఈ సారి ఎలాగైనా కడపలో మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవడం, అలాగే పులివెందులలో జగన్ మెజారిటీని తగ్గించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే క్రమంలో బాబు దూకుడుగా అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. ఇప్పటికే కడప ఎంపీగా శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని చెప్పేశారు. అటు రాజంపేట ఎంపీగా గంటా నరహరి పోటీ చేస్తారని తెలిసింది.

రాజంపేట అసెంబ్లీలో బత్యాల చెంగల్రాయుడు పోటీ చేయనున్నారు. ఇటు మైదుకూరు సీటు పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేయడం ఖాయం..అలాగే బద్వేల్‌లో ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని తెలిసింది. ఇక ప్రొద్దుటూరులో యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటీకి దిగనున్నారు. పులివెందులలో బీటెక్ రవి పోటీ చేయనున్నారు. అటు కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి పోటీ చేసే విషయంలో డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు సార్లు ఓడిపోయారు.

పైగా అక్కడ వీరశివారెడ్డి టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సీటు ఎవరికి ఫిక్స్ చేస్తారో క్లారిటీ రావడం లేదు. జమ్మలమడుగు సీటులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు…అయితే ఆది నారాయణ గాని మళ్ళీ టీడీపీలోకి వస్తే..ఈ సీటు ఆయనకే దక్కొచ్చు..లేదంటే భూపేష్ పోటీ చేస్తారని తెలుస్తోంది. కడప, రాయచోటి, రైల్వే కోడూరు సీట్లు తేలాల్సి ఉంది. మొత్తానికైతే కడపలో మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వే కోడూరు సీట్లలో గెలవాలని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది.