టీడీపీ కొత్త ఎత్తు…బొత్సతో ఈజీ కాదా?

అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ముందుకొస్తూనే ఉంది..ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది..ఈ సారి గాని అధికారం దక్కకపోతే టీడీపీ పరిస్తితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతిని నియోజకవర్గంలో బలపడటమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో బలమైన నేతల్లో ఒకరుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ చూస్తుంది…ఒక్క బొత్సని నిలువరిస్తే…విజయనగరం జిల్లాలో పార్టీకి బెనిఫిట్ అవుతుందని భావిస్తుంది.

అందుకే ఈ సారి బొత్సకు ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ చూస్తుంది…ఇదే క్రమంలో ఈ సారి బొత్సపై ప్రత్యర్ధిని మార్చాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో కూడా అభ్యర్ధులని మార్చిన విషయం తెలిసిందే. 2014లో చీపురుపల్లిలో బొత్సపై కిమిడి మృణాలిని పోటీ చేశారు. అప్పుడు బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం వల్ల ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన మృణాలిని విజయం సాధించారు.

ఇక 2019 ఎన్నికల్లో మృణాలిని వారసుడు నాగార్జున టీడీపీ నుంచి బరిలో దిగారు…ఇటు బొత్స వైసీపీ నుంచి పోటీ చేశారు. మామూలుగానే బొత్సకు బలం ఎక్కువ…పైగా వైసీపీలో ఉన్నారు..అటు వైసీపీ వేవ్ ఉంది..దీంతో బొత్స విజయం సాధించారు. అయితే ఈ సారి మాత్రం బొత్సకు ఛాన్స్ ఇవ్వకూడదని టీడీపీ భావిస్తుంది..ఈ క్రమంలోనే నాగార్జునకు కాకుండా ఈ సారి ఎస్సీ నేతని బరిలో దింపితే ఎలా ఉంటుందని టీడీపీ ఆలోచిస్తుంది.

ఈ క్రమంలోనే రాజాంకు చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని గాని లేదా ఆమె కుమార్తె గ్రీష్మని గాని బరిలో దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ అభ్యర్ధిని బరిలో దింపితే బొత్సకు చెక్ పెట్టొచ్చు అనేది టీడీపీ ఆలోచన. కానీ ఎవరు బరిలో దిగిన బొత్స లాంటి బలమైన నేతకు చెక్ పెట్టడం సాధ్యమైన పని కాదు. చూడాలి మరి ఈ సారి బొత్సని టీడీపీ ఎంతవరకు నిలువరించగలదో.