‘ఫ్యాన్’ స్పీడ్ పెంచుతున్న తమ్ముళ్ళు!

గత ఎన్నికల్లో వైసీపీ భారీ విజయానికి జగన్ వేవ్ ఒక కారణమైతే…టీడీపీపై ఉన్న వ్యతిరేకత మరొక కారణం. అసలు టీడీపీపై వ్యతిరేకత పెరగడానికి కారణం నేతల పనితీరు..అలాగే నేతల మధ్య నడిచిన అంతర్గత పోరు. దీని వల్లే టీడీపీ ఘోరంగా ఓడిపోయింది…ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే వైసీపీ గెలుపు కారణమని చెప్పొచ్చు. అయితే ఎన్నికలై మూడేళ్ళు దాటేశాయి. మళ్ళీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు బాగా స్ట్రాంగ్ అవ్వాలి…వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలి.

కానీ టీడీపీ నేతలు అలా లేరు…కొన్ని చోట్ల ఇంకా వీక్ గా ఉన్నారు..అలాగే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా కంచుకోట లాంటి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య రగడ నడుస్తోంది. కలిసికట్టుగా పనిచేసి వైసీపీకి చెక్ పెట్టాల్సిన సమయంలో గ్రూపు వార్ కు దిగుతూ…వైసీపీకి ఇంకా బెనిఫిట్ అయ్యేలా చేస్తున్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో గ్రూపు తగాదాల వల్ల ఇక్కడ పార్టీ ఓడిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరాయ చౌదరీని పక్కనపెట్టి…ఉమామహేశ్వర నాయుడుకు సీటు ఇచ్చారు. అప్పుడు రెండు వర్గాలుగా విడిపోవడంతో టీడీపీ ఓడిపోయింది. ఇప్పటికీ అక్కడ అదే రచ్చ జరుగుతుంది. దీంతో అక్కడ టీడీపీ బలపడటం లేదు.

ఇక మడకశిర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిల మధ్య సీటు ఫైట్ జరిగింది…సీటు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకవేళ సీటు ఒకరికి ఇస్తే…మరొకరు గెలుపుకు సహకరించే పరిస్తితి లేదు. అటు పెనుకొండలో బి‌కే పార్థసారథి, సవితమ్మల మధ్య పోరు నడుస్తోంది..ఎవరికి వారే సెపరేట్ గా  రాజకీయాలు చేస్తున్నారు. అలాగే శింగనమలలో బండారు శ్రావణికి సొంత పార్టీ వాళ్లే చెక్ పెడుతున్నారు. అనంతపురం అర్బన్ సీటులో ప్రభాకర్ చౌదరీ, జేసీ వర్గాలకు పడటం లేదు. ఇలా కంచుకోటలో తమ్ముళ్ళు రచ్చ చేస్తూ…ఇంకా వైసీపీని బలపడేలా చేస్తున్నారు.