పట్టున్న సీట్లలో సైకిల్ రివర్స్…!

అధికార వైసీపీని తట్టుకుని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయిందనే చెప్పాలి…గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా వరకు కోలుకుంది. దాదాపు వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైసీపీని దాటేసే స్టేజ్ కు వచ్చింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు దాదాపు ఖాయమనే పరిస్తితి. కానీ అలాంటి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా టీడీపీ సరిగ్గా ఉపయోగించుకోకుండా…ఇంకా రివర్స్ లో పోతుంది. దీని వల్ల గెలిచే సీట్లలో కూడా టీడీపీ ఓడిపోయే పరిస్తితి కనిపిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో దర్శి ఒకటి…గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది…అలాగే బలమైన నేతలు వైసీపీలోకి వెళ్లారు. దర్శిలో ఉండే కీలక నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరారు. అలాగే 2019 ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబూరావు సైతం వైసీపీలో చేరిపోయారు. దీంతో దర్శికి పమిడి రమేష్ ని ఇంచార్జ్ గా పెట్టారు.

అయితే రమేష్ ఎక్కడ తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు…ఎప్పుడు ప్రజల్లో ఉంటూ..వారి సమస్యల  పరిష్కారం కోసం పోరాటం చేశారు..సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు..కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. అలాగే ఇంత వైసీపీ వేవ్ లో రాష్ట్రంలో ఎక్కడ కూడా టీడీపీ…మున్సిపాలిటీల్లో గెలవలేదు. కానీ దర్శి మున్సిపాలిటీ టీడీపీ కైవసం కావడంలో రమేష్ కీలక పాత్ర పోషించారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో దర్శిలో టీడీపీ గెలుపు మాత్రమే మిగిలి ఉందనే తరుణంలో రమేష్..టీడీపీకి షాక్ ఇచ్చారు.

ఎంత కష్టపడి పనిచేసిన పార్టీ అధిష్టానం గుర్తించడం లేదని చెప్పి…నియోజకవర్గ ఇంచార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే సీటు విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే రమేష్..ఇంచార్జ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రమేష్ తప్పుకోవడం దర్శిలో టీడీపీకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. దర్శిలోనే కాదు…పెనుకొండ, కళ్యాణదుర్గం, గుంటూరు వెస్ట్ లాంటి సీట్లలో టీడీపీ బలంగా ఉన్నా సరే..నేతలకు సీట్లు ఇచ్చే విషయంలో క్లారిటీ లేకపోవడంతో..వారు యాక్టివ్ గా ఉండటం లేదు.