గల్లా కూడా తేల్చేస్తారా?

ప్రతిపక్ష టీడీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి…ఓ వైపు చంద్రబాబు..అధికార వైసీపీపై పోరాడుతుంటే..టీడీపీలో ఉండే కొందరు నేతలు సొంత పార్టీపైనే పోరాటం చేసే పరిస్తితి కనిపిస్తుంది. అనూహ్యంగా టీడీపీలో ఉండే అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య వర్గ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విజయవాడ టీడీపీలో కూడా వర్గ పోరు నడుస్తున్న సంగతి తెలుస్తోంది. ఇక పోరు కాస్త ఇప్పుడు టీడీపీని దెబ్బకొట్టేలా ఉంది.

అనూహ్యంగా ఎంపీ కేశినేని నాని రివర్స్ అయ్యి..సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే…మంచి చెబుతున్నా కూడా అర్ధం చేసుకోవడం లేదని నాని అంటున్నారు…అలాగే నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని మాట్లాడేస్తున్నారు…అలాగే బాబు ఎప్పుడు బ్రోకర్ల మాటే వింటారని ఫైర్ అవుతున్నారు. ఇలా టీడీపీలో కేశినేని వ్యవహారం ముదురుతుంది. అయితే కేశినేని పార్టీ మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఆయన మాత్రం పార్టీకి మంచి చెబుతుంటే తాను పార్టీ మారిపోతారని ప్రచారం చేస్తున్నారని మండిపోతున్నారు.

కేశినేని వ్యవహారం ఇలా ఉంటే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం మరోలా ఉంది..ఈయన కూడా పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు..అసలు గుంటూరులోనే పెద్దగా కనిపించడం లేదట. గల్లా కూడా పార్టీ జంప్ అయిపోతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో గల్లా తల్లి…గల్లా అరుణ కుమారి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే…ఇక తన కుటుంబ సభ్యులు, అనుచరులు నచ్చిన పార్టీలోకి వెళ్ళి రాజకీయం చేసుకోవచ్చని మాట్లాడారు.

ఈ వ్యవహారంపై గల్లా ఇంతవరకు స్పందించలేదు…అలాగే టీడీపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు…ఏదో పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం కనిపిస్తున్నారు గాని…రాష్ట్ర స్థాయిలో కనిపించడం లేదు. మరి గల్లా ఎంతకాలం ఇలా రాజకీయం చేస్తారో క్లారిటీ లేదు. మొత్తానికైతే టీడీపీలో గల్లా వ్యవహారం కూడా డౌట్ గానే ఉంది.