క్లీన్ స్వీప్: నెక్స్ట్ కష్టమేనా?

రాజకీయాల్లో విజయం అనేది సులువుగా వచ్చేది కాదు…చాలా కష్టపడాలి…ప్రజల మద్ధతు పొందాలి…ప్రత్యర్ధుల కంటే తాము బెటర్ అని నిరూపించుకోవాలి…అప్పుడే విజయాలు అందుతాయి. అయితే విజయం సాధించడమే కష్టం అనుకుంటే ఇంకా వన్ సైడ్ గా గెలవడం అనేది చాలా కష్టమైన పని …అలాంటి విజయాలు సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ కూడా చేసేసింది. అంటే వైసీపీని ఏ స్థాయిలో ప్రజలు ఆదరించారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఆ ఆదరణ పొందడానికి వైసీపీ ఎంత కష్టపడిందో. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి అన్నీ అనుకూల పరిస్తితులే ఉన్నాయి..కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితులు లేవు…అనూహ్యంగా రాజకీయం మారుతూ వస్తుంది…ఓ వైపు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంటే…మరో వైపు టీడీపీ పుంజుకుంటుంది…ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ మళ్ళీ క్లీన్ స్వీప్ చేయడం అనేది చాలా కష్టమైన పని.

గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది…మరి ఈ సారి కూడా చేస్తుందా? అంటే చెప్పలేం. పోనీ ప్రతిపక్ష టీడీపీకి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆ పార్టీకి లేవనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ..పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి చిత్తుగా ఓడింది.

కాబట్టి రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పొచ్చు. ఇక ఈ సారి ఎన్నికల్లో చాలా టఫ్ గా జరిగేలా ఉన్నాయి…వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా ఉంది. కాబట్టి రెండు పార్టీలకు క్లీన్ స్వీప్ చేయడం అనేది కష్టమయ్యేలా ఉంది. ఆఖరికి వైసీపీ కంచుకోటలుగా ఉన్న కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ సాధ్యమయ్యేలా లేదు. ఈ జిల్లాల్లో టీడీపీ కనీసం ఒకటి, రెండు సీట్లు అయిన గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి…కాబట్టి ఈ సారి రెండు పార్టీలకు క్లీన్ స్వీప్ కష్టమయ్యేలా ఉంది.