హిందూపురంలో బాలయ్య ప్రత్యర్ధి చేంజ్?

చిన్న కార్యకర్తని నిలబెట్టిన చాలు..హిందూపురంలో టీడీపీ గెలవడానికి..హిందూపురంలో ఎవరు నిలబడ్డా గెలుపు మాత్రం టీడీపీదే..మొదట నుంచి హిందూపురం టీడీపీ అడ్డాగా ఉంది..ఇంతవరకు ఇక్కడ టీడీపీ పోలేదు…టీడీపీని ఓడించడానికి ప్రత్యర్ధులు రకరకాల ప్రయోగాలు చేశారు గాని ఫలితం లేకుండా పోయింది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బాలయ్య విజయం సాధిస్తూ వస్తున్నారు. బాలయ్యని ఓడించడానికి వైసీపీ అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు.

2014లో వైసీపీ తరుపున నవీన్ నిశ్చల్, 2019లో ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు..ఇక 2024 ఎన్నికల్లో ఇక్కడ బాలయ్యపై మరో అభ్యర్ధిని దింపడానికి వైసీపీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం హిందూపురం ఇంచార్జ్ గా ఇక్బాల్ ఉన్నారు…ఈయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. కానీ ఇక్బాల్…హిందూపురంలో వైసీపీని బలోపేతం చేయడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. పైగా హిందూపురం వైసీపీలో గ్రూపులు ఎక్కువ ఉన్నాయి. నవీన్, అబ్దుల్ ఘనీ వర్గాలు…ఇక్బాల్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఇక్బాల్ పై అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.

ఇక తమకు టికెట్ ఇవ్వకపోయిన పర్లేదు గాని…ఇక్బాల్ కు మాత్రం సీటు ఇవ్వొద్దని నవీన్, అబ్దుల్ వర్గాలు తేల్చేసాయి. ఇక్బాల్ కు మళ్ళీ సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్లే ఓడించేలా ఉన్నారు. అయితే హిందూపురం వ‌దిలేయాలని జగన్ చెబితే తాను నియోజ‌క‌వ‌ర్గాన్ని వదిలేసి బ‌య‌ట‌కు వెళ్లిపోతాన‌ని ఇక్బాల్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఖ‌రాఖండిగా తేల్చిచెప్పారు.

అంటే హిందూపురం అభ్యర్ధి ఎవరు అనేది వైసీపీ అధిష్టానం చేతుల్లో ఉంది..ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో మళ్ళీ ఇక్బాల్ అని అభ్యర్ధిగా పెట్టే సాహసం వైసీపీ చేయదని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో హిందూపురంలో వేరే అభ్యర్ధిని పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్బాల్ ని పెడితే మాత్రం బాలయ్య హ్యాట్రిక్ విజయం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. దీని బట్టి చూస్తే నెక్స్ట్ ఇక్బాల్ ని పక్కన పెట్టి బాలయ్యపై కొత్త ప్రత్యర్ధి బరిలో దిగే ఛాన్స్ ఉంది.