వస్తున్నాడు.. అసలైన బింబిసారుడు.. జూ.ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ చారిత్రక ధీరుడు బింబిసారుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం బింబిసారా.. ఇప్పటివరకు అడపాదడపా సినిమాలు చేసుకుంటూ నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిద్దుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.NTR Chief Guest For Kalyan Ram's Bimbisara - Movie News

ముఖ్యంగా బింబిసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ చాలా చక్కగా ఒదిగిపోయినట్లు ట్రైలర్ లో మనం గమనించవచ్చు. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి అందుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ తో పాటు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక వీరితోపాటు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నట్లుగా అందుకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ను కూడా సోషల్ మీడియాలో వదిలారు. ఇక ఈ వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాకుండా..” వస్తున్నాడు.. అసలు సిసలైన బింబిసారుడు” అంటూ టాగ్ లైన్ కూడా ఇవ్వడంతో మరింత వైరల్ గా మారుతుంది ఈ వీడియో. ఇక హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జూలై 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక జరగబోతోంది ఇక ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ రాబోతున్నారు. ఇక ఈ విషయంపై నందమూరి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.https://fb.watch/eviUQ9ioGC/