సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సింగర్ గీతా మాధురి భర్త నందు అర్ధనగ్న ప్రదర్శన..ఫోటోలు వైరల్..!!

ద్యావుడా..కలియుగం అంతరించిపోనుందా..అందుకే ఇలాంటి విడ్డూరాలు చూడాల్సి వస్తుందా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు జనాల మదిలో మెదులుతున్నాయి. ఎప్పటి నుండో ఆడ మగ సమానం..ఇద్దరు కి సమాజంలో సమాన హక్కులు కల్పించాలి అంటు ఓ రేంజ్ లో ఫైట్ చేస్తున్నారు ఆడవాళ్లు . అయితే, ఇప్పుడు ఆడవాళ్లు మాత్రమేనా విప్పి చూపించేది మేము చూపించగలము అంటు కొందరు హీరోలు న్యూడ్ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. సినిమాలో అవకాశాల కోసం ఇలా చేస్తున్నారా అంటే లేదు.

ఏకంగా బడా పోజీషన్ లో ఉన్న స్టార్ హీరోలు ఇలా న్యూడ్ ఫోటో షూట్ చేస్తూ..సంచలనానికి తెర తీస్తున్నారు. దీని పై కొందరు నెటిజన్స్ స్టార్ హీరోలను తప్పు పడుతుంటే మరికొందరు..అమ్మాయిలు చేస్తే లేని తప్పు మేము చేస్తే వచ్చిందా..అంటూ మండిపడుతున్నారు. ఇంతకముందు హీరోలు అర్ధ నగ్న ఫోటో షూట్ లు చేసేవారు..కానీ రణవీర్ సింగ్ చేసిన అంత హాట్ న్యూడ్ గా ఎవ్వరు చేయలేదు అనే చెప్పాలి. విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ మూవీ ప్రమోషన్స్‌తో మొదలైన ఈ ట్రెండ్‌ను వివిధ హీరోలు, నటులు ఫాలో అవుతూ కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు రణవీర్ ను ఆదర్శంగా తీసుకుని మిగత చాలా మంది మగాళ్లు ఇలా న్యూడ్ గా ఫోటో షూట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే హీరో విష్ణు విశాల్‌..కూడా న్యూడ్ ఫోటో షూట్ చేసి రచ్చ రచ్చ చేశారు. విష్ణు భార్య ఎవరో కాదు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి అయిన గుత్తా జ్వాల . అయితే, తాజాగా మరో హీరో న్యూడ్ ఫోటో గ్రఫీ తో హాట్ గా ట్రెండ్ అవుతున్నాడు. సింగర్ గీతా మాధురి భర్త నందు గురించి మనకు తెలిసిందే.

పెద్దగా చెప్పుకోతగ్గ సినిమాలు చేయకపోయినా..గీతా మాధురి వల్ల బాగానే పాపులర్ అయ్యాడు . ఉన్న మంచి పేరును అలా ఉంచుకోకుండా “నేను కూడా రణవీర్ క్లబ్ లో జాయిన్ అయ్యాను”..అంటూ ఓ సెమి న్యూడ్ పిక్ ను షేర్ చేశాడు. వైట్ టవల్ కట్టుకుని మిగతా బాడీ అంత ఎక్స్ పోజ్ చేస్తూ..ధిట్టమైన బాడితో ఆ కండలు చూపిస్తూ..చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. దీంతో గీతా మాధురి భర్తను కూడా ట్రోల్ చేస్తున్నారు జనాలు. మరి చూడాలి ఈ రణవీర్ న్యూడ్ క్లబ్ లోకి ఇంకెంత మంది మగాళ్ళు జాయిన్ అవుతారో..?