అప్పటి స్టార్ హీరోల పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఇప్పట్లో స్టార్ హీరోల పారితోషకం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకటి రెండు సినిమాలలో క్రేజ్ లభించింది అంటే ఏకంగా రూ .50 కోట్ల పారితోషకం డిమాండ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ అప్పట్లో పారితోషకాలు కేవలం ఒక కంపెనీ ద్వారా మాత్రమే లభించేవి. అది కూడా ఉద్యోగం లాగా నెలవారి మాత్రమే వీరికి పారితోషకాలు అందించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే అగ్ర హీరోలుగా కొనసాగిన వారందరూ ఆస్తిపరంగా బాగా ఉన్నతంగా ఉన్నవాళ్లే కానీ పారితోషకం విషయంలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కోరకంగా తీసుకున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి అలనాటి స్టార్ హీరోల పారితోషకం ఎంతో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో జానపద , సాంఘిక, పౌరాణిక చిత్రాలను తెరకెక్కించిన ఘనత కూడా ఈయనకే దక్కింది. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అందరికంటే ఎక్కువ రూ.1 లక్ష రూపాయల పారితోషకం అందుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావుకి కూడా ఎంతో గుర్తింపు ఉండేది. ఎంతో మంది నటీనటులు కూడా ఆయన సలహా మేరకే పాత్రలలో నటిస్తూ ఉండేవారు అనే సమాచారం కూడా లేకపోలేదు. ఈయన కూడా లక్ష రూపాయల పారితోషకం అందుకున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ల హవా తగ్గుతున్న సమయంలోనే కృష్ణ , శోభన్ బాబుల హవా పెరిగింది. ఇక వాళ్లే ఎక్కువగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వీరు నటించిన సినిమాలు కూడా బాగా సక్సెస్ సాధిస్తూ ఉండడంతో దర్శక నిర్మాతలు కూడా వీళ్లతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. మొదట్లో వీరిద్దరూ రూ.5 లక్షల పారితోషకం తీసుకునేవారు. ఇకపోతే అప్పటివరకు అగ్ర హీరోగా కొనసాగిన ఎన్టీఆర్ ఉన్నట్టుండి పీక్స్ లోకి వెళ్ళిపోయి రూ.50 లక్షల పారితోషకం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక వీళ్లలో కృష్ణంరాజుకు మాత్రమే తక్కువ పారితోషకం లభించేది. ఇక సుమన్ , చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు ఎంట్రీ ఇచ్చేవరకు 80 ల స్టార్ హీరోల హవా ఎక్కువగా నడిచింది. చివరికి సీనియర్ ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమాతో కోటి రూపాయలు అందుకొని రికార్డు సృష్టించారు.