సినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు చాలా కామన్. ఎంత కామన్ అంటే..వాళ్ళ అవసరాలు తీర్చుకునే వరకు..మాత్రమే ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ తరువాత అంతా హుష్ కాకి. అలా ఉంటాది పరిస్ధితి . ఇలా ఇండస్ట్రీలో చాలా హీరో, హీరోయిన్లు..డైరెక్టర్ , హీరోయిన్లు చేసారు. ఆ లిస్ట్ లోకే వస్తారు స్టార్ హీరోయిన్ సమంత అండ్ హీరో సిద్ధార్ధ్. ఒకప్పుడు ఈ జంట చేసిన అల్లరి..హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే.
అప్పటికే హీరో సిద్ధార్ధ్ ఇద్దరు హీరోయిన్లతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడు అని వార్తలు వినిపించినా..సమంత మాత్రం సిద్ధు చెయ్యి వదలలేదు. వీళ్ళ మధ్య బాండింగ్ చూసి..రేపో మాపో పెళ్ళి కూడా చేసుకునేస్తారు అనుకున్నారంతా. ఏకంగా శ్రీకాళహస్తి లో కూడా పూజలు చేసారు వీళ్లు. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అంత చేసిన వీళ్లు ఎందుకు విడిపోయారు అంటే.. మాత్రం ఆన్సర్ లేదు. కొందరు ఏమో నాగ చైతన్య అని అంటారు. కొందరు ఏమో సమంత కి డబ్బు పిచ్చి అంటారు.
అయితే, సమంత – సిద్ధు వాళ్ల రిలేషన్ షిప్ లో చాలా నమ్మకంగా ఉన్నారట. చాలా జెన్యూన్ గా ఉండాలని కోరుకున్నారట. పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యి..వాళ్ల జాతకాలు చూయించుకున్నరంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. వీళ్ల జాతకంలో ఏదో దోషం ఉందని..దానికి పరిహారంగా వీళ్లు పూజలు చేశారట.
అంతేకాదు హోమాలు కూడా వేశారట. అలా ఇద్దరు కలిసి ఉండటానికి ఎన్నో పూజలు చేసిన వీళ్లు మాత్రం పెళ్లి వరకు రాలేకపోయారు. ఆ తరువాత సమంత నాగచైతన్య ని పెళ్ళి చేసుకుని..కొన్ని కారణాల చేత డివర్స్ కూడా ఇచ్చింది. సిద్ధూ ఇంకా అదే ఫార్ములాలో అమ్మాయిలను పడగొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కొత్త గర్ల్ ఫ్రెండ్ గా పేరు తెచ్చుకుంది..హీరోయిన్ అధితి హైదరి. ఈవిడ ఎన్ని నెలలు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటుందో చూద్దాం..!!