ఎస్టీ సీట్లు మళ్ళీ ‘ఫ్యాన్’ పరమే!

ఏపీలో రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీ చాలా బలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు వైసీపీకి ఎప్పుడు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు…2014 ఎన్నికలు కావొచ్చు…2019 ఎన్నికలు కావొచ్చు…రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీనే గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎస్టీ స్థానాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటింది.

రాష్ట్రంలో పోలవరం, అరకు, పాడేరు, రంపచోడవరం, కురుపాం, సాలూరు, పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వడ్ గా ఉన్నాయి. అయితే ఈ స్థానాల్లో మొదట్లో కాంగ్రెస్ సత్తా చాటేది..తర్వాత వైసీపీ గెలుస్తూ వస్తుంది. 2014లో పోలవరం మినహా మిగిలిన స్థానాల్లో వైసీపీ గెలిచింది..2019 ఎన్నికల్లో అన్నీ స్థానాలని వైసీపీనే గెలుచుకుంది…ఇక ఇప్పటికీ ఆ స్థానాల్లో వైసీపీ స్ట్రాంగ్ గానే ఉంది.

కాకపోతే స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కాస్త కనిస్తోంది. కురుపాం, పాలకొండ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలపడుతుంది. పాలకొండ, కురుపాం, పాడేరు లాంటి స్థానాల్లో టీడీపీకి కాస్త అనుకూలమైన వాతావరణం ఉంది.

అయితే వైసీపీని ఓడించడం అనేది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే….ఎస్టీ స్థానాల్లో ఉన్న ప్రజలు జగన్ పై అభిమానంతో ఉన్నారు..ఆ స్థానాల్లో కేవలం జగన్ ని చూసే వైసీపీకి ఓటు వేసే అవకాశాలు ఎక్కువ. ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరైనా సరే జగన్ ఇమేజ్ బట్టే ఈ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పొచ్చు.

గత ఎన్నికల్లో అదే పరిస్తితి నడిచిందని చెప్పొచ్చు…ఎందుకంటే పాడేరు, అరకు, రంపచోడవరం లాంటి స్థానాల్లో కొత్త అభ్యర్ధుళు నిలబడ్డారు. అయినా సరే అభ్యర్ధులని పట్టించుకోకుండా జగన్ బట్టి ఓటు వేసి వైసీపీని గెలిపించారు. ఇక ఈ సారి కూడా అలాగే జరిగేలా ఉంది..పైగా పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయి…కాబట్టి ఈ సారి కూడా ఎస్టీ స్థానాల్లో ఫ్యాన్ హవా నడిచేలా ఉంది.