ఇండస్ట్రీలో అలా చేసే ఒక్కే ఒక్క హీరో ఎన్టీఆర్..శేఖర్ మాస్టర్ బయటపెట్టిన నిజాలు..!!

డ్యాన్స్ మాస్టర్ శేఖర్.. పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నో మంచి మంచి పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసి..ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాలకు ఆయన డ్యాన్స్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా అల్ వైకుంఠపురం సినిమాలో రాములో రాములా సిగ్నేచర్ స్టెప్..సామజవరగమణ పాటలో ని కూల్ స్టెప్స్ బాగా హైలెట్ అయ్యాయి.

కాగా , ఈ మధ్య కాలంలో మరో పాటలోని స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి. సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్స్ స్టెప్స్ .. ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల్లో ఈ పాట పై రీల్స్ వచ్చాయి. స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ పాట కు చిందులు వేస్తున్నారు అంటే పాట ఎంత బాగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. కాగా, ఈ సినిమా మే 12న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యులు ఇస్తూ బిజీ గా మారింది. ఈ నేపధ్యంలో నే మీడియా తో ముచ్చటించారు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. సర్కారు వారి పాట సినిమా లోని విశేషాలు గురించి చెప్పుతూ..”సినిమా లో మహేశ్ బాబు స్టైల్ బాగుంటుందని. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు కంపోజ్ చేశానని.. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్ ..ఈ మాస్ సాంగ్ లో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు” అంటూ చెప్పు కొచ్చారు. అలాగే ఇండస్ట్రీలో మీరు చాలా మంది హీరోలతో వర్క్ చేశారు. మీకు డ్యాన్సుల పరంగా చాలా తక్కువ కష్టపడి,, ఈజీగా స్టెప్స్ వేసేది ఎవరు అని అడగ్గా.. “జూనియర్ ఎన్టీఆర్” అంటూ చెప్పుతూ…అస్సలు ప్రాక్టీస్ చేయకుండా.. డైరెక్ట్ గా సెట్స్‌కు వచ్చి అప్పటికప్పుడు స్పాట్ లోనే ఆ స్టెప్ వేసేస్తాడు” అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఇక తారక్ డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఏ స్టెప్స్ ని అయిన ఇరగదీస్తాడు.