వాడిని చెప్పుతోనే కొట్టాలి..విశ్వక్ పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు..!!

మీడియాలో విశ్వక్ సేన్-యాంకర్ దేవి నాగవల్లి రచ్చ టూ హాట్ గా తయారైంది. గోటి తో పోయేదాని గొడ్డలి వరకు తెచ్చుకుంటున్నారు వీళ్లు అంటూ జనాలు అంటున్నారు. మనకు తెలిసిందే..యంగ్ హీరో విశ్వక్ సేన్..‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమా లో హీరో గా నటించాడు. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ , పాటలు, ట్రైలర్ అన్ని బాగా మంచి రెస్పాన్ అందుకున్నాయి. జనాలు కూడా సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ అంటూ విశ్వక్ సేన్ ఓ ప్రాంక్ వీడియో చేయగా..అది కాస్త మిస్ ఫైర్ అయ్యి..ఇప్పుడు ఇలా ఈ పోజీషన్ కి వచ్చేలా చేసింది.

మే 6న రిలీజ్‌కి సిద్ధ‌మైన సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చేసిన ప్రాంక్ వీడియో గురించి టీవీ 9 కొన్ని కధనాలు ప్రసారం చేసింది. అంతేకాదు డిబేట్ పెట్టి నిజా నిజాలు మాట్లాడుతున్న టైంలో..విశ్వక్ సేన్ ఎంట్రీ కొంప ముంచింది. నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను లేకపోతే ఎలా అంటూ విశ్వక్ ఎంట్రీ ఇచ్చి డిబేట్ లో పాల్గొనడం..ఆ డిబేట్‌లో హీరో విశ్వ‌క్ సేన్‌ను యాంకర్ దేవి కోపం గా గెట్ అవుట్ అని అన‌డం.. దానికి హీరో..(F***) అంటూ మాట్లాడటం సంచలనంగా మారింది. అంత పెద్ద బూతు ప‌దాన్ని ఒక ఆడవ్యక్తి పై అలా అనడం .. చాలా మందికి నచ్చలేదు. విశ్వక్ తప్పు తెలుసుకుని సారీ చెప్పినా..ఆ వేడి తగ్గలేదు.

ఈ కాంట్ర‌వర్సీ పై చాలా మంది రియాక్ట్ అవుతూన్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదంపై మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ స్పందించారు. ఆయన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు…”అస్సలు విశ్వ‌క్ సేన్‌ని మేము ఓ హీరో అని అనుకోవడం లేదు. ఏ హీరో కూడా అలాంటి అస‌భ్య‌క‌ర‌మైన మాటలు మాట్లాడరు. అది కూడా లైవ్‌లో ఓ అమ్మాయి పై అంత నీచమైన మాట మాట్లాడటం క‌రెక్ట్ కాదు. ఈ విషయంలో విశ్వక్ సేన్ ది పెద్ద తప్పు. దేవిగారు మంచి యాంక‌ర్‌. ఓ హీరో మీడియా ముందుకువెళ్లినప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి.. వాళ్ళు ర‌క‌ర‌కాలైన ప్ర‌శ్న‌లు అడుగుతుంటారు. కానీ మనం ఓపికగా ఆన్సర్ ఇవ్వాళి. నీకు వాళ్ల ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఇచ్చే స‌త్తా దమ్ము లేన్న‌ప్పుడే టీవీల ముందుకు వెళ్లకూడదు. సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఆయన చేసిన రచ్చ దారుణం. రోడ్ల‌పై అరాచకం చేశాడు విశ్వక్ సేన్. అసలు నాగవళ్లి గారు ఆయన ఆ బూతు పదం మాట్లాడినప్పుడే స్పాట్ లో చెప్పుతో కొట్టి ఉండాల్సింది. అప్పుడైన బుద్ధి వచ్చేది. నిన్న టీవీలో విశ్వ‌క్ సేన్ మాట్లాడిన దానిపై పోలీసులు సుమోటా కేసును న‌మోదు చేయాలి. లేకపోతే మహిళా సంఘాలు కూడా ఆయనకు బుద్ధి వచ్చేలా చేస్తారు.”అంటూ విశ్వక్ సేన్ పై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మాటాలు నెట్టీంట వైరల్ గా మారాయి,