టాలీవుడ్ మాస్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ త్రిబుల్ ఆర్. రౌద్రం రణం రుధిరం సినిమా నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చి ఎట్టకేలకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ యునానమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా వసూళ్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఫస్ట్ డే వసూళ్లు ఎంత అన్నది అధికారికంగా బయటకు రాలేదు. ఎస్టిమేషన్స్ ప్రకారం రు. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అయితే వచ్చాయని అంటున్నారు. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా ఫస్ట్ డే హిస్టారికల్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
కేవలం ప్రీమియర్లు, బుకింగ్స్లతోనే 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మొదటి రోజుకే ఏకంగా 5 మిలియన్ డాలర్ల వసూళ్లు సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కే ఈ స్థాయి వసూళ్లు అంటే మామూలు అరాచకం కాదు అనే చెప్పాలి. ఏదేమైనా ఇదో సంచలన రికార్డుగా నిలిచింది. మరి ఫైనల్ రన్లో ఈ సినిమా వసూళ్లు ఏ రేంజ్లో ఆగుతాయో ? చూడాలి.