పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక పవన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉత్తరాదిన కూడా క్యాష్ చేసుకోవాలని చూశారు చిత్ర యూనిట్.
దీని కోసం భీమ్లా నాయక్‌ను హిందీ వర్షన్‌లో కూడా రిలీజ్ చేయాలని వారు ప్లాన్ చేశారు. అయితే తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేసిన తరువాత హిందీ వర్షన్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ హిందీ వర్షన్ రిలీజ్‌కు నోచుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
దీంతో ఈ సినిమా పలు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అయితే హిందీలో కూడా ఇది ఓటీటీలో దర్శనమివ్వనుందని.. అందుకే ఈ సినిమా హందీ వర్షన్ థియేట్రికల్ రిలీజ్‌కు నోచుకోలేకపోతుందని చిత్ర యూనిట్ అంటోంది. పవన్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా దక్షిణాదిన బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని కూడా హిందీ నాట రిలీజ్ కాకపోవడంతో అక్కడి పవన్ ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనవుతున్నారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.