ఆర్ఆర్ఆర్.. ఫస్టాఫ్ అంతసేపా?

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రేయేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం జక్కన్న మార్క్ మూవీగా రాబోతోంది. ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 2 నిమిషాలుగా ఉంబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా ఫస్టాఫ్ చాలా లెంగ్తీగా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఏకంగా 100 నిమిషాల తరువాత రాబోతుందట. అంటే.. 1 గంట 40 నిమిషాల ఫస్టాఫ్ తరువాతే మనం బ్రేక్ తీసుకోనున్నాము.

ఇంతటి భారీ ఫస్టాఫ్‌ను ప్లాన్ చేసిన చిత్ర యూనిట్, మరి ఆ సమయంలో ఎలాంటి కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనుందో చూడాలి అంటున్నారు సినిమా లవర్స్. ఇక ఈ సినిమా సెకండాఫ్ 82 నిమిషాల పాటు ఉండబోతుందట. అంటే సెకండాఫ్ కూడా ఏకంగా 1 గంట 22 నమిషాలు ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ఇంతటి లెంగ్తీ రన్ టైమ్ ఉన్న సినిమా ఎలాంటి కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనుందో తెలియాలంటే మాత్రం ఎల్లుండి వరకు వెయిట్ చేయాల్సిందే.