ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న తెలుగు వారు మరియు భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్. “రౌద్రం రణం రుధిరం” టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాకు బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించారు. మరోవైపు టాలీవుడ్‌లోనే క్రేజీ హీరోలుగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు.
ఈ సినిమాకు తెలుగు గడ్డ మీద మాత్రమే కాకుండా.. యావత్ భారతదేశ వ్యాప్తంగాను.. అటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో తిరుగులేని క్రేజ్ ఉంది. దుబాయ్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో 1100 స్క్రీన్లలో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు ఇప్పటికే అక్కడ 2 మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాకు మామూలు బజ్ లేదు. ఆస్ట్రేలియాలో గతంలో ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానంత స్థాయిలో భారీ ఎత్తున త్రిబుల్ ఆర్ రిలీజ్ అవుతోంది. అక్కడ ఈ సినిమాను రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అక్కడ ఏయే థియేటర్లలో.. ఏ లొకేషన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లిస్ట్ కూడా ప్రకటించారు. ఈ లిస్ట్ చూస్తుంటేనే అక్కడ RRR సినిమా ఓ లెవెల్ హైప్ తో ముందు వస్తుందని అర్థమవుతోంది.
All set for a Biggest Ever Release for any Indian Film in Australia Region. @Radhakrishnaen9 @MoviesTolly #RRR Final list of theatres!🔥🔥🔥🌊🌊🌊 @RRRMovie @DVVMovies @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 @ajaydevgn @aliaa08 @PharsFilm @HoytsNZ @EVENTCinemasNZ pic.twitter.com/gwsL4y25Ex
— Radhakrishnaentertainments (@Radhakrishnaen9) March 23, 2022