రష్మిక నోటి దూల..దిమ్మతిరిగే షాకిచ్చిన సుక్కు..?

సినీ ఇండస్ట్రీలో ఉన్నాక ఏదైనా విషయం మాట్లాడుతుంటే ఆచి తూచి మాట్లాడాలి. అది కూడా పెద్ద డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని..ఒకటికి మూడు సార్లు ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే కధలో చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆ తరువాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక అలాంటి పరిస్ధితులనే ఎదురుకుంటుందట కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న. అమ్మడు పేరు ఇప్పుడు ఎలా మారు మ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఒకప్పుడు కూడా రష్మిక కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అది ఢబుల్ కాదు ట్రిపుల్ అయ్యింది. దానికి ముఖ్య కారణం పుష్ప సినిమా. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడం..సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం..కోట్లకు కోట్లు కలెక్షన్స్ కలెక్ట్ చేయడం తో అటు బన్ని-సుకుమార్ పేరుతో పాటు..ఇటు రష్మిక పేరు కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడకి వెళ్ళినా కూడా రష్మిక ను శ్రీవల్లి గానే గుర్తిస్తున్నారు..సామీ సామీ పాటకు స్టెప్పులు వేయమంటున్నారు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు రష్మిక సినీ కెరీర్ కి పుష్ప సినిమా ఎంత ప్లస్ అయ్యిందో.

ఇక ఇదే విషయాని రష్మిక కూడా అర్ధం చేసుకున్నట్లు ఉంది. అందుకే రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది. అంతా ఇంతా కాదు ఏకంగా ఢబుల్ చేసి తన దగ్గరకు వస్తున్న డైరెక్టర్స్ కు నిర్మాతలకు పట్టపగలే చుక్కలు చూయిస్తుంది. ఈ క్రమంలోనే తనకు ఇంతటి సక్సెస్ ని ఇచ్చిన సుకుమార్ ని కూడా లెక్క చేయకుండా..పుష్ప 2 కి కొత్త లెక్కలు అడుగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..పుష్ప 2 సినిమాకి రష్మిక ముందు మాట్లాడుకున్న రేటు కన్న ఎక్కువ డిమాండ్ చేస్తుందట. రష్మిక రేటు పెంచడంలో అడగటంలో తప్పులేదు..కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు..సుకుమార్ కి కోపం తెప్పించాయట.

సినిమాలో హీరోతో సమానంగా నటించాను..ఎక్కడ మీరు చెప్పిన దానికి నో చెప్పలేదు.. అంటూ తలపొగరు తో మాట్లాడిందట. ఇంత మాటలు అన్నాక సుక్కు కి కోపం రాకుండా ఉంటాదా..వచ్చింది.. కానీ అందరి డైరెక్టర్స్ లాగా అరిచి గోల చేయలేదు. తనదైన స్టైల్లో రష్మిక పాత్రను కట్ చేసారు. పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రను చంపేసాడు. ద్రాక్షాయని చేసిన దాడిలో శ్రీవల్లి చచ్చిపోతుందట.. ఇక ఆ ప్లేస్ లోకి కొత్త హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేసారట సుక్కు. అమ్మడుకి దిమ్మ తిరిగిపోయేలా బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ను సెలక్ట్ చేసారట. ఇప్పుడు స్టోరీలో అసలు మజా వస్తుంది అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా రష్మిక కు కొంచెం నోటి దూల ఎక్కువే అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.


Leave a Reply

*