అక్క ఇంటికి వ‌స్తే.. మ‌ర‌ద‌లిని ప్రెగ్నెంట్ చేసిన బావ‌.. క్లైమాక్స్ ఇదే..!

స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ సంబంధాలు మంట క‌లుస్తున్నాయి. అస‌లు మాన‌వ సంబంధాల‌కు విలువ లేకుండా చేస్తున్నారు కొంద‌రు దుర్మార్గులు. తాజాగా త‌న అక్క ఇంటికి వ‌చ్చిన ఓ మైన‌ర్ బాలిక‌పై అక్క భ‌ర్త అయిన బావే క‌న్నేశాడు. మ‌ర‌ద‌ల‌ను మాయ మాట‌లు చెప్పి లొంగ‌దీసుకుని గ‌ర్భ‌వ‌తిని చేశాడు. అస‌లు విష‌యంలోకి వెళితే క‌ర్నాట‌క‌లోని శివ‌మొగ్గ జిల్లాలో కుంసి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ యువ‌తి చ‌దువుకునేందుకు త‌న అక్క ఇంట్లోనే ఉంటోంది.

అందంగా ఉన్న త‌న మ‌ర‌ద‌లిపైనే క‌న్నేశాడు అక్క మొగుడు అయిన బావ‌. మ‌ర‌ద‌లికి మామ యాట‌లు చెప్పి ఆరేడు నెల‌లుగా అత్యాచారం చేస్తూ వ‌చ్చాడు. దీంతో ఆ మైన‌ర్ బాలిక గ‌ర్భ‌వ‌తి అయ్యింది. ఇటీవ‌ల బాలిక‌కు అనారోగ్యంగా ఉండ‌డంతో ఆమె అక్క ఆసుప‌త్రికి తీసుకు వెళ్లింది. అక్క‌డ ఆమెను ప‌రీక్షించిన వైద్యులు ఆమె ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని చెప్పారు.

బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి గొడవ లేకుండా ఇంటికి తీసుకొచ్చారు. బాలికకు నొప్పులు రావ‌డంతో ఆమెను ఓ ఆసుప‌త్రిలో చేర్పించారు. ఆ మైన‌ర్ యువ‌తి ఏడు నెల‌ల‌కే ప్ర‌స‌వించ‌గా ఆ బిడ్డ మృతి చెందింది. పోలీసులు ఆ బావ‌పై పోక్సో కేసు న‌మోదు చేసి అరెస్టు చేసి.. కటకటాల్లోకి తరలించారు.


Leave a Reply

*