బాల‌య్య హ్యాండ్‌తో ఆ సినిమా రేంజ్ పెరిగిందంటోన్న కుర్ర హీరో…!

అఖండ సినిమా త‌ర్వాత బాల‌య్య పూన‌కం టాలీవుడ్‌కు బాగా ప‌ట్టేసింది. ఈ పూన‌కం ఇప్ప‌ట్లో దిగేలా లేదు. ఎవ‌రికి వాళ్లు జై బాల‌య్యా నినాదం ఎత్తుకుంటున్నారు. ఎక్క‌డ చూసినా ఇప్పుడు బాల‌య్య నినాదాలు మార్మోగుతున్నాయి. దీనికి తోడు బాల‌య్య తొలిసారిగా హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షోతో ఇటు ఈ త‌రం జ‌న‌రేష‌న్ జ‌నాల‌కు, యువ‌త‌కు, సోష‌ల్ మీడియాలో చాలా మందికి బాల‌య్య బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఇప్పుడు బాల‌య్య రేజ్‌లో ఉండ‌డంతో ఆయ‌న చేయి ప‌డితే ఏదైనా రేజ్ అయిపోతోంది.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య ఇటీవ‌ల ప‌లు సినిమా ఫంక్ష‌న్ల‌కు కూడా వ‌స్తున్నారు. బాల‌య్య చేయి ప‌డితే అది ఖ‌చ్చితంగా త‌మ సినిమాకు హెల్ఫ్ అవుతుంద‌ని చాఆలా మంది భావిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో సెహ‌రీ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పోస్ట‌ర్‌ను బాల‌య్య స్వ‌యంగా రిలీజ్ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాపై అంతంత మాత్రంగానే ఉన్న అంచ‌నాలు డ‌బుల్ అయిపోయాయి.

హీరో హ‌ర్ష్ క‌నుమిలి సైతం మాట్లాడుతూ బాల‌య్య గారు లాక్‌డౌన్ టైంలోనే మా సెహ‌రి పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డంతో సినిమా స్థాయి పెరిగిపోయింద‌ని.. అందుకు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు అని హ‌ర్ష్ చెప్పాడు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా ఈ సినిమా తెర‌కెక్కింది. హీరోయిన్ సిమ్రాన్ సైతం బాల‌య్య గారికి స్పెష‌ల్ థ్యాంక్స్ అని.. ఆయ‌న పోస్ట‌ర్ రిలీజ్ చేశాక మా సినిమా స్థాయి పెరిగింద‌ని సంతోషం వ్య‌క్తం చేసింది.

ఏదేమైనా బాల‌య్య హ్యాండ్ ప‌డిన వెంట‌నే సెహ‌రి రేంజ్ అయితే మారింది. మ‌రి ఇది ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌కు ఎంత వ‌ర‌కు హెల్ఫ్ అవుతుందో ? చూడాలి.


Leave a Reply

*