ఆంటీ అన్నందుకు ఫీలైపోయిన హీరోయిన్‌..!

సెల‌బ్రిటీల‌ను సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ ఎంత హ‌ర్ట్ చేస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద స్టార్లు అయినా.. బ‌య‌ట ఎన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా కూడా సోష‌ల్ మీడియాలో వ‌చ్చే సున్నిత‌మైన విమ‌ర్శ‌ల‌ను ఒక్కోసారి త‌ట్టుకోలేరు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే నెగిటివిటీని త‌ట్టుకోలేకే కొంద‌రు సెల‌బ్రిటీలు త‌మ సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌ను క్లోజ్ చేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయినా కొంద‌రు ట్రోల‌ర్స్ మాత్రం ఇంకా మార‌డం లేదు.

ఎప్పుడూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ సెటైర్ల‌తో సెల‌బ్రిటీల‌ను బాధ పెడుతూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ నందితా శ్వేత‌కు కూడా ఇలాంటిదే ఓ బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్ ఎదురైంది. ఆమె కొన్ని ఫ్యామిలీ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల‌ను చూసిన కొంద‌రు ప్ర‌శంసించారు. మ‌రి కొంద‌రు మాత్రం పిచ్చి కామెంట్ల‌తో ఆమెను విమ‌ర్శించారు.

నువ్వు చాలా బాగున్నావ్‌.. ఆంటీలా క‌నిపిస్తున్నావ్‌.. నువ్వు నీ ఫిజిక్ మార్చుకుంటే బాగుంటుంది.. ఇంకా వ‌ర్క‌వుట్లు చేయ్ అంటూ కామెంట్ చేశారు. దీంతో నందితా శ్వేత కోసం న‌షాళానికి అంటేసింది. త‌న ఇన్ స్టాలో అత‌డి గురించి ఘాటుగా రాయ‌డంతో పాటు స్ట్రాంగ్ కౌంట‌ర్ కూడా ఇచ్చింది.

ఎవ‌రి బాడీ వాళ్ల ఇష్టం.. నేను ఇప్పుడు ఎలా క‌నిపిస్తున్నానో.. అలాగే ఉండ‌డం నాకు ఇష్టం.. ఈ విష‌యంలో నాకు నీ స‌ల‌హాలు అక్క‌ర్లేద‌ని చెప్పింది. తాను దేవ‌త‌ను కాద‌ని.. మ‌నిషినే అని.. నాకు నా బాధ‌లు, ఇబ్బందులు, ఫీలింగ్స్ ఉంటాయ‌ని చెప్పింది. అస‌లు మీకు ఇలాంటి మాట‌లు ఎలా వ‌స్తాయ‌ని కూడా ఆమె ఫైర్ అయ్యింది. ఈ విష‌యంలో నందిత‌కు చాలా మంది నెటిజ‌న్లు స‌పోర్ట్ చేస్తున్నారు.


Leave a Reply

*