పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా.. ఆ చిన్నారి.. అతి పిన్నవయసులోనే దేశంలో ఎవరూ ఊహించని.. అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఏ పదేళ్లకో పదిహేనేళ్లకో కానీ.. లభించని అరుదైన పపురస్కారాన్ని.. ఆ చిన్నారి కేవలం 4 ఏళ్ల వయసులోనే సొంతం చేసుకుని అబ్బుర పరిచింది. ఔరా..! అనిపించింది. ఆ పాపే.. గుంటూరు జిల్లా కరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మాజీ రైల్వే బోర్డ్ సభ్యుడు కనుమూరి బాజి చౌదరి కుమార్తే చిన్నారి యోగాశ్రిత.
సాధారణంగా 4 ఏళ్ల వయసు అంటే.. ఏం తెలుస్తుంది? కనీసం వారికి స్పృహ కూడా అంతంత మాత్రంగా నే ఉంటుంది. అలాంటిది.. ఈ చిన్నారి.. యోగాశ్రిత మాత్రం… పుట్టినప్పటి నుంచి ఎంతో చురుగ్గా వ్యవహరించేది. ఈ క్రమంలోనే జనరల్ నాలెడ్జ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా డిగ్రీలు చదివిన వారికి కూడా ఒక పట్టాన అంతుపట్టని.. నదులపై అంతులేని పరిజ్ఞానం పెంచుకుంది. దేశంలో ఉన్న నదులు.. వాటి గమ్య స్థానాలు.. పుట్టుక ప్రాంతాలు.. ఇలా.. అనేక అంశాలపై యోగాశ్రిత అపార జ్ఞానం సొంతం చేసుకుంది.
ఇటీవల దేశంలో ఉన్న అన్ని నదులకు సంబంధించి జరిగిన కాంపిటీషన్‌లో పాల్గొన్న యోగాశ్రిత 33 ప్రశ్నలకు ఒక్క నిమిషంలో కరెక్ట్ సమాధానం చెప్పింది అందరినీ విస్మయ చకితులను చేసింది. “ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్“ లో స్ధానం సంపాయించుకుంది. దీంతో పాటు గోల్డ్ మెడల్ సాధించింది. అనంతరం.. తన సంతోషాన్ని టీడీపీఅ ధినేత చంద్రబాబుతో పంచుకుంది. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి… కలిసి.. ఆశీస్సులు స్వీకరించింది.
ఇంత చిన్న వయస్సు లో ఇలాంటి అరుదైన రికార్డ్ తో పాటు గోల్డ్ మెడల్ సాధించడం పట్ల చంద్రబాబు అభినందించారు. 39 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు లభించేది. చిన్నారి యోగాశ్రిత కు తాను సాధించిన మెడల్ ను చంద్రబాబు చేతుల మీదుగా స్వీకరించింది. భవిష్యత్ లో మరెంతో ఉన్నత స్ధానానికి చేరుకోవాలని చిన్నారి యోగాశ్రితను చంద్రబాబు ఆశీర్వదించారు.