టాలీవుడ్ లో మరో విషాదం.. ఆమె చనిపోయింది?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో దశాబ్దాల పాటు నటుడిగా హీరోగా విలన్గా సేవలందించారు గొల్లపూడి మారుతీరావు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప రచయితగా కూడా బహుముఖ ప్రజ్ఞను చాటారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది నటులకు గొల్లపూడి పూర్తి ఆదర్శంగా నిలిచారు అనే చెప్పాలి.. అయితే 2019 డిసెంబర్ 12వ తేదీని గొల్లపూడి మారుతీ రావు అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన గొల్లపూడి మారుతీరావు తుది శ్వాస విడిచి అభిమానులందరినీ కూడా శోకసంద్రంలో నెట్టారు ఇదే రోజు.

 

ఇక ఇప్పటికీ ఏ సినిమా చూసినా ఈ పాత్ర గొల్లపూడి చేసి ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు.. అంతలా ఆయన జ్ఞాపకాల తోనే ఇంకా ఉంటున్నారు అభిమానులు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో విషాదకర వార్త అభిమానులను అభిమానులందరినీ దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. సినిమా పరిశ్రమలో మరో కన్నీటి విషాదం సంఘటన చోటు చేసుకుంది. దివంగత నటుడు రచయిత గొల్లపూడి మారుతీ రావు సతీమణి శివాకామసుందరి ఈరోజు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కాగా ప్రస్తుతం గొల్లపూడి మారుతీ రావు సతీమణి శివరామ వయసు 81 సంవత్సరాలు కావడం గమనార్హం.

ఇక గొల్లపూడి మారుతీరావు అభిమానులు అందరూ కూడా శివాకామసుందరి మృతిపై సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. 1961 లో హనుమకొండ లో జన్మించిన శివాకామసుందరి కి గొల్లపూడి మారుతి రావు తో వివాహం జరిగింది. అయితే చిన్నప్పుడు నుంచి రచనలపై ఎంతో ఆసక్తి కనబరిచిన మారుతీ రావు కి పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది. అది 1951 సంవత్సరం.. ఆ రోజుల్లో ఉద్యోగాలు రావడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ తనలోని రచనా శక్తితో మారుతీరావు ఆంధ్రప్రభ దినపత్రికలో ఉపసంచాలకులు ఉద్యోగం సంపాదించుకున్నారు. ఆ తర్వాత చిత్తూరులో మరో పత్రిక ఎడిషన్ ప్రారంభించినప్పుడు అక్కడ సంపాదక వర్గంలో కూడా పనిచేశారు మారుతీరావు.