టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్ని ఎవరో కాదు.. ఆయనే స్వయంగా తెలియజేశాడు. అయితే నాగశౌర్య పెళ్లి కావాలంటే ఓ ట్విస్ట్ ఉందండోయ్.. అదేంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఇటీవల `వరుడు కావలెను` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగశౌర్య.. ఇప్పుడు `లక్ష్య`తో రాబోతున్నాడు.
సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోతున్న ఈ చిత్రంలో `రొమాంటిక్` భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడే విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్స్ లోను .. ఓవర్సీస్ లో 100 థియేటర్లలోను ఈ సినిమాను విడుదల చేశాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగశౌర్య.. లక్ష్య గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. అలాగే తన పెళ్లిపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన పెళ్లి గురించి ఎప్పుడూ ఇంట్లో చర్చ నడుస్తూనే ఉంటుంది, ముఖ్యంగా గత లాక్‌డౌన్‌లో పెళ్లి పెళ్లి అంటూ ఇంట్లో గోల పెట్టేశారని చెప్పుకొచ్చిన నాగశౌర్య.. మళ్లీ లాక్‌డౌన్ వస్తే మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అయితే నా పెళ్లి కోసం లాక్‌డౌన్ రావాలని కోరుకోవడం లేదు.. లాక్‌డౌన్ వస్తే మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన వ్యాఖ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.